ఈ మధ్య కాలంలో డివోర్స్ తీసుకోవడం చాలా సాధారణ విషయంగా మారిపోయింది. సామాన్యుల జీవితాల్లో డివోర్స్ అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ సెలబ్రెటీలు, క్రికెట్ స్టార్లు డివోర్స్ తీసుకున్నారంటే.. ఆ ఏముందిలే అని ఇది చాలా కామన్ అని అనుకుంటున్నాం. కొన్నేళ్ల క్రితం సమంత, నాగ చైతన్యతో మొదలుపెడితే.. ఇటీవలే విజయ్, సంగీతల వరకు.. అలాగే క్రికెటర్లలో హార్దిక్ పాండ్యా, నటాషా.. చాహల్, ధనశ్రీ. ఇలా ప్రతిరోజూ మనం వార్తల్లో చూసే వ్యక్తులే డివోర్స్ తీసుకుంటున్న తీరు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.














