Chandrababu Naidu Birthday: చంద్రబాబు బర్త్ డేకి లక్ష మందికిపైగా అన్నదానం.. టీటీడీకీ భాష్యం రామకృష్ణ భారీ విరాళం | | ACTPnews

Bhashyam


Last Updated:

Chandrababu Naidu Birthday: తెలుగు రాష్ట్రాల్లోనే పేరు గడించిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ సీఎం పుట్టిన రోజు సందర్భంగా తన వంతుగా తిరుమలలో భక్తులకు ఒకరోజు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చంద్రబాబు పేరు మీదుగా రామకృష్ణ నిర్వహించారు.

+

Bhashyam Ramakrishna donation

Tirumala: ఒకే సందర్భంలో రెండు మంచి పనులు చేయడం అరుదుగా జరుగుతుంది. అలాంటి వాటినే స్వామికార్య, స్వకార్యం అంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన భక్తులు, టీడీపీ శ్రేణులు అనేక సేవా, సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లోనే పేరు గడించిన భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ సీఎం పుట్టిన రోజు సందర్భంగా తన వంతుగా తిరుమలలో భక్తులకు ఒకరోజు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చంద్రబాబు పేరు మీదుగా రామకృష్ణ నిర్వహించారు. ఇందుకు ఖర్చు రూ.44 లక్షలను టీటీడీకి అందజేశారు.ఈసందర్భంగా టీటీడీ అధికారులు, పాలకమండలి ఆయనకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

బాబుపై భాష్యం అధినేత అభిమానం..

75ఏళ్లు పూర్తి చేసుకొని 76వ వసంతంలోకి అడుగుపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేరుతో పార్టీ శ్రేణులు, అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. అదే విధంగా సేవ కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే భాష్యం విద్యాసంస్థల చైర్మెన్ శ్రీ భాష్యం రామకృష్ణ కుటుబం సభ్యులు ఉదయం విఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడిపై శ్రీవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించానని చెప్పారు.

రెండో సారి అన్నదానం..

అదేవిధంగా భక్తులకు నిత్యం అందించే అన్నప్రసాద సేవలో భాగంగా ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే రూ.44 లక్షలను భాష్యం విద్యాసంస్థల తరఫున శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదానికి విరాళంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు.ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ఇప్పుడే కాదు యువనాయకుడు, మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా కూడా గతంలో ఒకరోజు అన్నవితరణ ఖర్చు రూ.44 లక్షల చెక్కును టీటీడీ చైర్మెన్‌కి అందజేశారు రామకృష్ణ. ఇక వీరితో పాటు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

కొండపై భక్తుల రద్దీ..

సోమవారం శ్రీవారిని మొత్తం 76,406 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 28,463 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.45 కోట్లకు చేరుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో ప్రస్తుతం 8 వెయిటింగ్ కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు సుమారు 6 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports