Last Updated:
కేవలం గ్లింప్స్, పాటలతోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సినిమా చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాకు ‘బేబి’ సినిమా దర్శకుడు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లేతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
కేవలం గ్లింప్స్, పాటలతోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సినిమా చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాకు ‘బేబి’ సినిమా దర్శకుడు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లేతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. దాంతో బేబి లాంటి హార్డ్ హిట్టింగ్ లవ్‌స్టోరి మరోసారి చూపించబోతున్నాడని ప్రేక్షకులు ఫుల్‌గా ప్రిపేర్ అయ్యారు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గౌరీ ప్రియా రెడ్డి హీరోయిన్గా నటించింది. గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం.
స్టీవెన్ శంకర్ అలియాస్ కిరణ్ అబ్బవరం తన పేరు వెండితెరపై చూసుకోవాలని కలలు కనే ఒక ఆనాధ. కల కోసం భాష రాని చెన్నైకి వచ్చేస్తాడు. అక్కడే నివేదిత అలియాస్ గౌరీ ప్రియ పరిచయమవుతుంది. అప్పటికే గౌరీ ప్రియకు అజయ్(త్రిగుణ్)తో పెళ్ళి క్యాన్సల్ అయి డిప్రెషన్లోకి వెళ్లిపోతుంది. ఆల్కహాల్ తీసుకుంటూ అజయ్ ఆలోచనల్లో బ్రతుకుంది. చెన్నై వచ్చిన స్టీవెన్, నివేదిత ఫ్రెండ్స్‌తో కలిసి పోయి అదే ఇంట్లో ఉంటాడు. ఇక నివేదితను డ్రిపెషన్ నుంచి మాములు స్థితికి తీసుకురావడానికి పలు విధాల ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో ఆమెతో తిట్లు కూడా తింటాడు. ఫైనల్‌గా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి స్టీవెన్‌తో ట్రావెల్ చేస్తుంది. ఒక టైమ్‌లో నివేదిత, స్టీవెన్‌ను పెళ్లి చేసుకుందాం అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? స్టీవెన్‌ను నివేదిత పెళ్లి చేసుకుందా? స్టీవెన్‌కు వెండితెరపై తన పేరును చూసుకోవాలనుకున్న కల నిజమైందా? అనేవి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే…
ఇప్పటి వరకు టాలీవుడ్లో కొన్ని వందల లవ్ స్టోరీలు చూసుంటాం. కానీ ఈ సినిమా వందల ప్రేమ కథల్లో ఒకటి కాదు. కాస్త డిఫరెంట్. అలా అని తోపు లవ్ స్టోరీ కూడా కాదు. కానీ ఒక మంచి సినిమా చూశామనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. దర్శకుడు రవి అబ్బూరి సినిమాను రాసుకున్న విధానం చాలా బాగుంది. కాకపోతే ప్రజెంట్ చేయడంలో మాత్రం కాస్త తడబడ్డాడు అనిపించింది. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవడమే ఒక బ్రేకప్ పెళ్లితో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మెల్లి మెల్లిగా సినిమాలో ఇన్వాల్స్ అయిపోతుంటాం. కిరణ్ అబ్బవరం ఎంట్రీ, నివేదిత ఫ్రెండ్స్‌తో కలిసి మాట్లాడడం.. ఆ తర్వాత ఇంట్లోకి రావడం సినిమాల్లో ట్రై చేయడం వంటివి బాగా చూపించారు. ఈ మధ్యలో గౌరీ ప్రియతో లవ్ ట్రాక్ కూడా బాగా వర్కవుట్ అయింది.
గౌరీ ప్రియను డిప్రెషన్‌ను నుంచి బయటకి తీసుకురావడానికి కిరణ్ చేసే ప్రయత్నాలు కాస్త నవ్వు తెప్పిస్తాయి. మొత్తానికి ఫస్ట్ హాఫ్ కాస్త ఎంటర్టైనింగ్నే అనిపిస్తుంది. కానీ ఏదో మిస్ అవుతుంది అనుకున్న టైమ్‌లో ఇంటర్వెల్లో ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చి అందరిబుర్ర బద్దలైపోయేలా చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్లో షాకింగ్ ట్విస్ట్ తర్వాత ఒక హై నోట్‌తో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అని క్యూరియాసిటిని క్రియేట్ చేశాడు. ట్విస్ట్ బాగానే పెట్టి సెకండ్ హాఫ్‌పై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు కానీ.. దాన్ని చివరి వరకు కంటిన్యూ చేయడంలో మాత్రం డైరెక్టర్ తడబడ్డాడు అనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే సెకండ్ హాఫ్‌పై ఇంకాస్త కసరత్తు పెట్టుంటే సినిమా కల్ట్ ప్రేమకథ అయ్యేది అనిపించింది.
స్టీవెన్ శంకర్‌గా కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కుమ్మేశాడు. అసలు కొన్ని సీన్లలో పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అనిపించింది. ఇక ఈ సినిమాలో అసలు హీరోయిన్ కాదు హీరో గౌరీ ప్రియా అని చెప్పాలి. నివేదిత క్యారెక్టర్లో జీవించేసింది. బ్రేకప్ అయిన అమ్మాయి జీవితం ఎంతలా ఉంటుందో గౌరీ ప్రియా తన నటనతో చూపించింది. స్క్రీన్‌పై ఆమె పర్ఫార్మెన్స్కు మాములు రెస్పాన్స్ రాలేదు. మిగిలిన నటులు త్రిగుణ్, సిరి, దేవి ప్రసాద్ వంటి నటులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
ఈ సినిమాకు ప్రాణం మణిశర్మ సంగీతమనే చెప్పాలి. ఎవడ్రా మణిశర్మ పని అయిపోయింది అన్నాడు. అసలు మణిశర్మ మాత్రం కుమ్మి అవతల విసరాడు. చాలా సీన్లకు తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రాణం పోశాడు. ఇక సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌కు మాత్రం ఇంకాస్త పని చెప్పుండాలి అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా ల్యాగ్ అనిపిస్తుంది. కొన్ని సీన్లు లేపేస్తే బాగుండేది అనిపించింది.
రేటింగ్: 3
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jul 23, 2026 11:33 PM IST














