Last Updated:
Chess Boxing: సాధారణంగా బాక్సింగ్ రింగ్‌లో నిలబడి ప్రత్యర్థి దవడ పగలగొట్టే కండబలం ఉన్నవాడు ఒకవైపు.. నిశ్శబ్దంగా కూర్చుని గంటల తరబడి ఎత్తులకు పైఎత్తులు వేసే ఆలోచనాపరుడు మరోవైపు ఉంటారు.
ఈ రెండు విరుద్ధ ప్రపంచాలను కలిపితే ఎలా ఉంటుంది? శరీర దారుఢ్యం, మానసిక ఏకాగ్రత రెండింటినీ ఒకే వేదికపై పరీక్షించే అత్యంత విచిత్రమైన క్రీడే “చెస్‌బాక్సింగ్” (Chess Boxing). మొదట్లో ఓ కామిక్ పుస్తకంలోని ఊహాజనిత అంశంగా ప్రారంభమైన ఈ ఆట, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధికారిక టోర్నమెంట్లు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లతో విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంటోంది.














