Last Updated:
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) వస్తుందంటే అభిమానులకు ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ ఏడాది ఆ పండగ మరింత ప్రత్యేకంగా మారనుందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆ వివరాలు చూస్తే..
టాలీవుడ్ అగ్ర హీరో, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) వస్తుందంటే అభిమానులకు ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ ఏడాది ఆ పండగ మరింత ప్రత్యేకంగా మారనుందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ స్పెషల్ డే నాడు మెగా ఫ్యాన్స్‌కు ఒకేసారి రెండు భారీ సర్ ప్రైజ్ లు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రెండు ప్రతిష్టాత్మక చిత్రాల నుంచి అదిరిపోయే అప్‌డేట్స్ రానున్నాయనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
చిరంజీవి హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15 గురువారం రోజున దసరా పండగ సెలవుల కానుకగా విడుదల చేసే అవకాశముంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ (VFX) పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ రిలీజ్ డేట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారని సమాచారం.
‘విశ్వంభర’ తో పాటుగా, ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – మాస్ డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్). కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ వద్ద మాస్ విధ్వంసం సృష్టించిన డైరెక్టర్ బాబీ, మళ్లీ చిరుతో జతకట్టడంతో ట్రేడ్ వర్గాల్లో సైతం ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆగస్టు 22న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేస్తారని గట్టిగా టాక్ వినిపిస్తోంది.
మొత్తంగా చూసుకుంటే, ఈ ఆగస్టు 22న ‘విశ్వంభర’ రిలీజ్ డేట్, ‘మెగా 158’ గ్లింప్స్ రూపంలో రాబోయే ఈ డబుల్ ధమాకా సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మెగా అభిమానులకు ఈ పుట్టినరోజు నిజమైన ట్రీట్ కానుంది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














