Last Updated:
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) విడుదల చుట్టూ ఉన్న సస్పెన్స్ మరింత ముదురుతోంది.
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) విడుదల చుట్టూ ఉన్న సస్పెన్స్ మరింత ముదురుతోంది. ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు చేసిన ఆఖరి చిత్రం కావడంతో దీనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ చిత్రాన్ని సంక్రాంతి (పొంగల్) కానుకగా జనవరి 9నే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, కొన్ని అనివార్యమైన సెన్సార్ సమస్యలు, పొలిటికల్ కంటెంట్ వివాదాల కారణంగా ఈ సినిమా సకాలంలో థియేటర్లలోకి రాలేకపోయింది. జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు ఐదు నెలలు గడిచినప్పటికీ, ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.
సంక్రాంతి విడుదల ఖాయమనుకుని మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, నాన్-థియేట్రికల్ (ఓటీటీ, శాటిలైట్) బిజినెస్ డీల్స్‌ను భారీ రేట్లకు క్లోజ్ చేశారు. అయితే, సినిమా విడుదల నిరవధికంగా వాయిదా పడటంతో తాజా సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం… రిలీజ్ ఆలస్యం కావడం వల్ల నాన్-థియేట్రికల్ డీల్స్ ఇప్పటికే రద్దయినట్లు తెలుస్తోంది. మరోవైపు, థియేట్రికల్ డీల్స్‌ను కూడా రద్దు చేసి, అడ్వాన్స్‌లు చెల్లించిన డిస్ట్రిబ్యూటర్లకు వారి డబ్బును తిరిగి (రీఫండ్) ఇచ్చేయాల్సిందిగా నిర్మాతలను సీఎం విజయ్ స్వయంగా కోరినట్లు తమిళ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
బిజినెస్ ఒత్తిడి లేకుండా, సినిమా విడుదల తేదీ అధికారికంగా ఖరారైన తర్వాత థియేట్రికల్ రైట్స్ తమ వద్దే ఉంచుకుని, నిర్మాణ సంస్థ ‘కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్’ ద్వారానే ఈ చిత్రాన్ని సొంతంగా రిలీజ్ చేయాలని విజయ్ సూచించినట్లు కోలీవుడ్ టాక్. టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం, నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ తెలుగు సినిమా ‘భగవంత్ కేసరి’ కథ ఆధారంగా రీమేక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, మమితా బైజు కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో కనిపించనున్నారు. విజయ్ పొలిటికల్ కెరీర్‌కు మైలేజ్ ఇచ్చేలా ఈ చిత్రంలో భారీ మార్పులు చేసినందు వల్లే రిలీజ్ ఆలస్యమవుతోందని, త్వరలోనే ఈ చిక్కులన్నీ వీడి కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jun 05, 2026 12:33 PM IST













