CM Vijay: సీఎం విజయ్‌కి GOAT డైరెక్టర్ ఖతర్నాక్ గిఫ్ట్.. కల నిజమైన వేళ ఎమోషనల్ పోస్ట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Last Updated:May 19, 2026 2:04 PM IST స్టార్ హీరోగా సినీ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన విజయ్.. ఇప్పుడు తమిళనాడు సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా GOAT డైరెక్టర్ వెంకట్ ప్రభు..

News18


Last Updated:

స్టార్ హీరోగా సినీ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన విజయ్.. ఇప్పుడు తమిళనాడు సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా GOAT డైరెక్టర్ వెంకట్ ప్రభు ఆయనకు ఖతర్నాక్ గిఫ్ట్ ఇచ్చారు.

News18
News18

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న దళపతి విజయ్, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, తొలి ఎన్నికలలోనే ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన విజయంతో తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు విజయ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో దర్శకుడు వెంకట్ ప్రభు సీఎం విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక బహుమతిని అందించారు. ‘TN07 CM 2026’ అనే ప్రత్యేక నంబర్ ప్లేట్‌తో తయారు చేసిన మెమెంటోను విజయ్‌కు బహూకరించారు. ఈ ఫోటోలను వెంకట్ ప్రభు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ చేశారు.

“ఒక చిన్న ఆలోచనగా మొదలైన ప్రయాణం ఈరోజు చరిత్ర సృష్టించింది. మన గౌరవనీయ ముఖ్యమంత్రి విజయ్ అన్నను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే” అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ద్విపాత్రాభినయంలో నటించిన ‘GOAT – The Greatest Of All Time’ చిత్రం రాజకీయ చర్చలకు కూడా కారణమైంది. సినిమాలో విజయ్ నడిపిన కారుకు ‘TN07 CM 2026’ అనే రిజిస్ట్రేషన్ నంబర్ ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2024లో సినిమా విడుదలైనప్పుడు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని అభిమానులు, ఇప్పుడు విజయ్ సీఎం అయిన తర్వాత ఆ సన్నివేశాన్ని వైరల్ చేస్తున్నారు. దర్శకుడు ముందుగానే విజయ్ రాజకీయ భవిష్యత్తును ఊహించారంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

విజయ్ రాజకీయ విజయం అనంతరం #TN07CM2026 హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. నటుడు ప్రేమ్‌జీ అమరన్ కూడా దీనిపై స్పందించడం మరింత చర్చకు దారి తీసింది. ప్రస్తుతం వెంకట్ ప్రభు అందించిన ప్రత్యేక మెమెంటో ఫోటోలు అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

About the Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports