ముఖ్యమంత్రి విజయ్‌ని కలిసిన నటుల జాబితా పెరుగుతూనే ఉంది. సింబు, శాంతను, సిబి సత్యరాజ్, పార్థిబన్ రాధాకృష్ణన్, శ్యామ్, సిమ్రాన్, స్నేహ, విశాల్.. ఇంకా మరికొందరు రానున్నారని అంచనా. వీరంతా సీఎంని కలవడం ఫార్మాల్టీ కోసమే కాదు.. ఇన్నాళ్లూ తమతో నటుడిగా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు సీఎం అవ్వడం అనేది వారికి ఎంతో ఆనందం కలిగించే అంశం. యువతకు అదో ప్రేరణ. చాలా మందికి తాము కూడా సినిమాల్లోకీ, రాజకీయాల్లోకీ వెళ్లాలనే ఆశ ఇప్పుడు కలుగుతుంది. అంతెందుకు ఒకప్పుడు విజయ్ కూడా.. సీఎంలను చూసి ప్రేరణ పొందిన వారే.













