Commonwealth Games 2026: తల్లి కలను నిజం చేస్తూ.. గాయాలను జయించి.. రిలయన్స్ ఫౌండేషన్ మద్దతుతో కామన్వెల్త్ ఫైట్‌కు సిద్ధమైన లోకేష్! | క్రీడా వార్తలు | ACTPnews

లోకేశ్ సత్యనాథన్


Last Updated:

Commonwealth Games 2026: సవాళ్లను ఎదురించి, గాయాలను జయించి అమెరికా మైదానంలో జాతీయ రికార్డులతో భారతదేశ జెండాను ఎగురవేసిన భారత లాంగ్ జంప్ సంచలనం లోకేష్ సత్యనాథన్ ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్-2026 బరిలోకి దిగుతున్నారు. ప్రతిష్టాత్మక NCAA డివిజన్-1 ఛాంపియన్‌షిప్ సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన లోకేష్, రిలయన్స్ ఫౌండేషన్ అందిస్తున్న అత్యాధునిక మద్దతుతో కామన్వెల్త్ వేదికపై భారత్‌కు మరో పతకం అందించేందుకు సిద్ధమయ్యారు.

లోకేశ్ సత్యనాథన్
లోకేశ్ సత్యనాథన్

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026 (Commonwealth Games) అథ్లెటిక్స్ విభాగంలో భారత లాంగ్ జంప్ సంచలనం లోకేష్ సత్యనాథన్ సరికొత్త లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక NCAA డివిజన్-1 ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని, 8.21 మీటర్ల దూరం దూకి కొత్త జాతీయ ఇండోర్ రికార్డుతో చరిత్ర సృష్టించిన లోకేష్, ఇప్పుడు కామన్వెల్త్ వేదికపై భారత జెండాను ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు.

సవాళ్లను దాటి సరికొత్త శిఖరాలకు!

బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల ఈ యువ అథ్లెట్ ప్రయాణం అనేక ఎదురుదెబ్బలతో నిండి ఉంది. తీవ్రమైన గాయాలు, రెండు శస్త్రచికిత్సలు, రోడ్డు ప్రమాదం, దానికితోడు కోవిడ్ సమయాన కన్నతల్లిని కోల్పోయిన తీరని శోకం ఆయనను ఎంతగానో కృంగదీశాయి. అయితే, తల్లి ఇచ్చిన “నీ కలలను వదులుకోవద్దు” అనే మాటలే స్పూర్తిగా అమెరికాలో స్కాలర్‌షిప్‌ సాధించి మరీ ట్రాక్‌పై తన సత్తా చాటారు.

రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలవడంతో..

లోకేష్ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించడంలో రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) నిర్వహించిన ‘అథ్లెట్ సపోర్ట్ ఎకోసిస్టమ్’ అత్యంత ప్రాధాన్యత వహించింది. అమెరికాలో శిక్షణ పొందుతూనే, భారతదేశంలో ఆయన పోటీల క్యాలెండర్‌ను (Competition Calendar) వ్యూహాత్మకంగా ప్లాన్ చేయడంలో రిలయన్స్ ఫౌండేషన్ మార్గదర్శనం అందించింది. ఆయనకు అవసరమైన ఫిట్‌నెస్ వసతులు, టెక్నికల్ సపోర్ట్‌ను అందిస్తూ లోకేష్ కెరీర్ పురోగతిలో నిలకడ సాధించేందుకు పూర్తి మద్దతుగా నిలిచింది. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో మురళీ శ్రీశంకర్‌తో కలిసి భారత లాంగ్ జంప్ విభాగంలో లోకేష్ పోటీ పడుతుండటంతో, భారత్‌కు మరో పతకం ఖాయమని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed