Corona: కరోనా వెనుక అమెరికా నిధులు.. కీలక సూత్రధారిగా అధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు.. తులసీ గబార్డ్ సంచలన ప్రకటన! | | ACTPnews

తులసీ గబార్డ్


Last Updated:

ఈ మేరకు అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI)గా తన పదవీకాలం ముగిసే చివరి రోజున (జూన్ 19) తులసీ గబార్డ్ అధికారిక పత్రాలను విడుదల చేస్తూ ఈ విస్తుపోయే నిజాలను బహిర్గతం చేశారు.

తులసీ గబార్డ్
తులసీ గబార్డ్

Corona: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను బలిగొన్న కోవిడ్ మహమ్మారి పుట్టుకకు సంబంధించి అంతర్జాతీయంగా మరోసారి తీవ్ర సంచలనం రేగుతోంది. కరోనా వైరస్‌పై చైనాలోని వుహాన్ ప్రయోగశాల (WIV) నిర్వహించిన ప్రమాదకర పరిశోధనలకు అమెరికా నుంచే నిధులు అందాయని, ఈ వాస్తవాలను అగ్రరాజ్యానికి చెందిన కొందరు ఉన్నతస్థాయి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెట్టారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI)గా తన పదవీకాలం ముగిసే చివరి రోజున (జూన్ 19) తులసీ గబార్డ్ అధికారిక పత్రాలను విడుదల చేస్తూ ఈ విస్తుపోయే నిజాలను బహిర్గతం చేశారు.

కుట్ర వెనుక ఆంటోనీ ఫాచీ హస్తం?

తులసీ గబార్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధాన వైద్య సలహాదారుగా, దాదాపు 38 ఏళ్ల పాటు అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (NIAID) అధిపతిగా పనిచేసిన ఆంటోనీ ఫాచీ ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది.

గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్‌లపై అత్యంత ప్రమాదకరమైన ‘గెయిన్-ఆఫ్-ఫంక్షన్’ (వైరస్ తీవ్రతను, వ్యాప్తిని పెంచే) పరిశోధనల కోసం ఫాచీ.. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును (కోట్లాది రూపాయలను) వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి మళ్లించినట్లు పత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

కేవలం చైనా మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30కి పైగా దేశాల్లో ఉన్న 120కి పైగా జీవ ప్రయోగశాలలకు (Bio-labs) అమెరికా ప్రభుత్వం దీర్ఘకాలంగా భారీగా నిధులు సమకూరుస్తోందని దర్యాప్తులో తేలింది.

నిజాలను తొక్కిపెట్టే ప్రయత్నం!

2020 ప్రారంభంలో అమెరికాలో కోవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయం నుండి ప్రభుత్వ విధానాలకు ఫాచీనే దిశానిర్దేశం చేశారు. అయితే, ఈ వైరస్ వుహాన్ ల్యాబ్ నుండే లీక్ అయిందనే వాస్తవాలు బయటకు రాకుండా ఆయన గట్టిగా ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి.

మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో చైనా నిఘా అధికారులతో ఫాచీ జరిపిన సంభాషణల వివరాలు, ల్యాబ్ లీక్ డేటాను దాచిపెట్టి.. ఈ వైరస్ కేవలం జంతువుల నుండే సహజసిద్ధంగా మానవులకు వ్యాపించిందనే వాదనను బలంగా ప్రచారం చేయించారని గబార్డ్ పేర్కొన్నారు. ఇందుకోసం అమెరికాకు చెందిన కొన్ని కీలక నిఘా విభాగాలలోని అధికారులను కూడా వాడుకున్నట్లు సమాచారం. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి వెనుక ఉన్న ఈ ‘బయో-ల్యాబ్’ నిధుల వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై సరికొత్త చర్చకు, రాజకీయ దుమారానికి దారితీస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports