Last Updated:
మహారాజా రంజిత్‌సింగ్ 1896లో ఇంగ్లాండ్ టెస్టు జట్టులో ఆడిన తొలి భారతీయుడు. ఆయన పేరుతో రంజీ ట్రోఫీ జరుగుతోంది.
భారత్‌కు స్వాతంత్ర్యం 1947లో వచ్చింది. కానీ అంతకంటే చాలా ముందే భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టింది. 1932లో భారత జట్టు తొలి టెస్టు ఆడగా.. అంతకంటే నాలుగు దశాబ్దాల ముందే ఓ భారతీయుడు ఇంగ్లాండ్ జట్టులో చోటు సంపాదించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ పేరు మహారాజా కుమార్ రంజిత్‌సింగ్. ఆయన పేరుతోనే నేడు దేశంలో ప్రతిష్ఠాత్మక దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ జరుగుతోంది.














