Stalin vs Vijay: తమ్ముడూ విజయ్.. హుందాగా ప్రవర్తించు.. తమిళనాడు సీఎంపై విరుచుకుపడ్డ స్టాలిన్! | | ACTPnews

విజయ్, స్టాలిన్


Last Updated:

Stalin vs Vijay: ఎమర్జెన్సీ కాలంలో తాను అనుభవించిన జైలు జీవితం, ‘మీసా’ (MISA) చట్టం కింద ఎదుర్కొన్న చిత్రహింసలపై తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు.

విజయ్, స్టాలిన్
విజయ్, స్టాలిన్

నాడు కారాగారంలో పోలీసులు చేసిన దాష్టీకానికి సంబంధించిన గాయాల తాలూకు ఆనవాళ్లు నేటికీ తన శరీరంపై సజీవంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నతమైన రాజ్యాంగ పదవికి తగిన హుందాతనాన్ని కాపాడాలని విజయ్‌కు హితవు పలికారు. అసెంబ్లీలో పోలీస్ శాఖ గ్రాంట్లపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ వివాదం రాజుకుంది. ప్రస్తుత అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు డీఎంకే ఎప్పుడూ ‘మీసా’ పోరాటాలను తెరపైకి తెస్తోందంటూ విజయ్ ఎద్దేవా చేశారు. ఆ సమయంలో స్టాలిన్ అరెస్టును ప్రస్తావిస్తూ విజయ్ తన దవడపై చెయ్యి వేసుకుని చేసిన సైగ.. స్టాలిన్ జైలు గాయాన్ని కించపరిచేలా ఉందని ప్రతిపక్ష డీఎంకే నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports