CSK vs LSG: దుమ్మురేపిన ఉర్విల్ పటేల్.. లక్నోపై చెన్నై థ్ల్రిల్లింగ్ విక్టరీ | క్రీడా వార్తలు | ACTPnews

credit: x


Last Updated:

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ పటేల్ అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నై జట్టు సంచలన విజయం నమోదు చేసింది. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై అలవోకగా ఛేదించగా, ఈ ఓటమితో లక్నో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.

credit: x
credit: x

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై అద్భుత విక్టరీ సాధించింది. ఉర్విల్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్‌తో 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 3 బంతులు మిగిలి ఉండగా చెన్నై ఛేదించేసింది. ఉర్విల్ పటేల్ కేవలం 23 బంతుల్లో 65 పరుగులు సాధించారు. ఇందులో 2 ఫోర్లు, 8 భారీ సిక్సులు బాదటం విశేషం. ఇక సంజూ శాంసన్ 28 (3 ఫోర్లు, 2 సిక్సులు), రుతురాజ్ గైక్వాడ్ 42 (3 ఫోర్లు, 2 సిక్సులు) రాణించగా.. చివర్లో శివమ్ దూబే 15 (2 సిక్సులు), ప్రశాంత్ వీర్ (2 సిక్సులు) మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఈ ఓటమితో లక్నో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి వెదొలిగింది.

లక్నో బ్యాటింగ్ ఇలా..!

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేశారు. జాష్ ఇంగ్లిస్ (88; 10 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ తో పాటు చివర్లో షహబాజ్ అహ్మద్ (43; 3 ఫోర్లు, 3 సిక్సులు) వేగంగా పరుగులు చేయడంతో స్కోర్ 200 దాటగలిగింది. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *