Last Updated:
అక్కినేని అఖిల్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా లెనిన్. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ ని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు నాగార్జున.
కింగ్ అక్కినేని నాగార్జున టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 40 వసంతాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన సందర్భాన్ని పురస్కరించుకుని, అక్కినేని అభిమానులకు ఒక బ్లాక్‌బస్టర్ సర్ప్రైజ్ లభించింది. నాగార్జున సినీ ప్రస్థాన మైలురాయిని పురస్కరించుకుని, ఆయన కుమారుడు అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ విలేజ్ డ్రామా ‘లెనిన్’ (Lenin) చిత్ర టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.
ఈ ప్రత్యేక అప్‌డేట్‌ను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ నాగార్జున ఎమోషనల్ అయ్యారు. “ఈరోజు (మే 23) నా సినీ జీవితం మొదలై 40 ఏళ్లు పూర్తయిన రోజు. నా కెరీర్ ఆరంభమైన ఈ రోజే అఖిల్ నాకు ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇచ్చాడు. టీజర్ చూస్తుంటే చాలా హాయిగా, గర్వంగా ఉంది. మీరు కూడా చూడండి.. మనోడు వస్తున్నాడు!” అంటూ ట్వీట్ చేశారు.
Today, May 23rd
నా సిని జీవితం మొదలైన రోజు
Akhil నాకో చిన్న surprise ఇచ్చాడు చూస్తుంటే చాలా హాయి గా ఉంది
మీరు చూడండి.మనోడు వస్తున్నాడు…. #ManoduVasthunnadu #LeninOnJune26th
— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 23, 2026
ఒక వినూత్నమైన డ్రామా సీన్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. స్టేజ్ నాటకంలో భాగంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే “ఆచార్య దేవా.. ఏమంటివి ఏమంటివి” అంటూ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ ఐకానిక్ డైలాగ్‌ను ఎంతో శక్తివంతంగా పలకడం, దానికి అఖిల్ స్పందిస్తూ.. “ఎన్టీఆర్ అంత గొప్పగా కాకపోయినా నువ్వూ బాగానే చెప్పినావ్ లే” అని ప్రశంసించే బ్యూటిఫుల్ ఎమోషనల్ సీన్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.
ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని గతంలో ఎన్నడూ చూడని విధంగా రాయలసీమ రూరల్ యువకుడిగా పూర్తి రగ్డ్ అండ్ ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నారు. అఖిల్ బాడీ లాంగ్వేజ్, చిత్తూరు యాసలో ఆయన పలికించిన పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ అక్కినేని ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. “నేను తప్పిపోయి రాలేదు మచ్చా.. మీ అందరినీ వెతుక్కుంటూ వచ్చిన” అంటూ అఖిల్ చెప్పే డైలాగ్, ఆ వెంటనే వచ్చే కత్తి ఫైట్ సీన్ సినిమాలో ఉండబోయే హై-వోల్టేజ్ యాక్షన్‌కు అద్దం పడుతోంది. ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే పల్లెటూరి పిల్లకుగా ఎంతో అందంగా కనిపిస్తూ, అఖిల్‌తో ఫ్రెష్ కెమిస్ట్రీని పండించింది.
ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో అఖిల్ అక్కాబావలుగా ప్రముఖ నటి శరణ్య, సీనియర్ నటుడు శివాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, ప్రవీణ్, పావని కరణం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో మెరవనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM), లియోన్ బ్రిట్టో అందించిన విజువల్స్ టీజర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘లెనిన్’ చిత్రం.. జూన్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా అఖిల్ కెరీర్‌లోనే అతిపెద్ద మాస్ హిట్ కానుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













