YS Avinash Reddy | ఏపీలో పెట్రోల్ కొరతకు కూటమి ప్రభుత్వమే కారణం! | ACTPnews

YS Avinash Reddy | ఏపీలో పెట్రోల్ కొరతకు కూటమి ప్రభుత్వమే కారణం!



ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా వేధిస్తున్న పెట్రోల్, డీజిల్ కొరతపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. “దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇంధన కొరత ఏర్పడింది అని కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శిని ప్రశ్నించగా.. ఆయన విస్తుపోయే నిజాలు చెప్పారు” అని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్ర అధికారులు స్పష్టం చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను దాచిపెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports