Last Updated:
Danam Nagender: దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే తెలంగాణ శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.
Danam Nagender: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనం రేపిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు కేసులో రాష్ట్ర హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి (Disqualified) అనర్హుడిగా ప్రకటిస్తూ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. గతంలో దానంపై వచ్చిన అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పూర్తిగా కొట్టేసింది. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే తెలంగాణ శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును తాను గౌరవిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో, ఎన్నికల్లోనే పోరాడతానని .. పోరాటాల ద్వారానే తాను ఈ స్థాయికి వచ్చానన్నారు. ఇక భవిష్యత్ ప్రణాళికపై త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కి పార్టీ ఫిరాయింపు కేసులో హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి (Disqualified) అనర్హుడిగా ప్రకటించింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పూర్తిగా కొట్టేసింది. దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే తెలంగాణ శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ తాను ప్రజాక్షేత్రంలోనే, ఎన్నికల్లోనే అన్ని విషయాలు తేల్చుకుంటానని శనివారం మీడియాతో తెలిపారు.
Danam Nagender says ready to contest elections again
Danam Nagender on Friday welcomed the Telangana High Court verdict disqualifying him as Khairatabad MLA, saying he was ready to contest elections again.
Reacting to the verdict, Nagender said he would fight whenever the… pic.twitter.com/X7H1eMqp6u
— Sudhakar Udumula (@sudhakarudumula) September 18, 2026
తనకు ఎన్నికల్లో పోటీ చేయడం కొత్తేమీ కాదన్న కాంగ్రెస్ నేత ఎన్నో పోరాటాలు చేసే ఈరోజు ఈస్థాయికి చేరుకున్నానని ధీమాగా చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజల మద్దతుతో పోరాడి విజయం సాధిస్తానంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యాయపోరాటం కంటే రాజకీయంగానే దీనిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్లుగా పరోక్షంగా సంకేతాలిచ్చారు. గతంలో స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు, దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, నాగేందర్ మాత్రం తన పోరాటాన్ని ప్రజాక్షేత్రానికే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌పై అనర్హతవేటు వేసిన హైకోర్టు తీర్పును స్వాగతిస్తోంది బీఆర్ఎస్. సత్యమేవ జయతే అంటూ ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయడం కాంగ్రెస్ నేతలకు మింగుడు పటడం లేదు.
Satyameva Jayate !!
BRS MLA Danam Nagendar who defected to Congress got disqualified by the Hon’ble High Court today
The rest of the defectors will also meet the same fate soon
— KTR (@KTRBRS) September 18, 2026
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ (BRS) తరఫున గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుండి ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. స్వచ్ఛందంగా రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నందున రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (యాంటీ డిఫెక్షన్ లా) ప్రకారం ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ఈ మెగా తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో కాంగ్రెస్‌లోకి వెళ్లిన మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలలో కూడా వణుకు మొదలైంది. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలంతా ఉపఎన్నికలకు వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏంటా అనే చర్చ జరుగుతోంది. మరో రెండేళ్ల పదవికాలం ఉండగానే కాంగ్రెస్‌కి ప్రజలు ఉపఎన్నికలు వస్తే ఎలాంటి తీర్పు ఇస్తారనే టాపిక్ కూడా జోరుగా నడుస్తోంది.














