వరుస సంఘటనలతో కొత్తగా వచ్చే ముఖ్యమంత్రులు ఈ బంగ్లాను దూరం పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా దీనిని తన అధికారిక నివాసంగా చేసుకోవడానికి నిరాకరించారు. క్రమంగా, ఈ బంగ్లా ఒక ప్రభుత్వ ఆస్తిగా కంటే, రాజకీయ కథలకూ, మూఢనమ్మకాలకూ సంబంధించిన అంశంగా మారింది. చాలా కాలం పాటు, దీని వినియోగం పరిమితంగానే ఉంది. అలాంటి సమయంలో జాస్మిన్ షా ఉదంతం మరో కలకలం రేపింది. ఈ కాంప్లెక్స్‌లో పనిచేసిన చివరి అధికారి, అప్పటి ఢిల్లీ డైలాగ్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్.. జాస్మిన్ షా. 2022 నవంబర్‌లో, ఆమెను ఆ పదవి నుంచి తొలగించాలని.. లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా.. అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆదేశించారు. ఆమె తన పదవిని రాజకీయంగా దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనకు కూడా ఆ బంగ్లాయే కారణం అనే ఆరోపణలు వచ్చాయి.













