Delivery Boy: ఒకేసారి అనేక మందితో వివాహిత.. డెలివరీ బాయ్ షాకింగ్ డెసిషన్, వైరల్ అవుతున్న వీడియో ఇదే | ట్రెండింగ్ | ACTPnews

shocking marriage story


Last Updated:

Delivery Boy: భర్త కష్టాల్లో పాలుపంచుకోవాల్సిన జీవిత భాగస్వామి అతడికి జీవితం మీదే విరక్తి కలిగిస్తే ఏ మగాడైనా ఎందుకు ప్రాణాలతో ఉంటాడు..? భార్య ప్రవర్తనతో విసిగిపోయిన ఓ పాతికేళ్ల యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఆమె చేసిన పని ఏంటో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

shocking marriage story
shocking marriage story

Delivery Boy: మగాడు ఎంత కష్టపడినా అందుకు కారణం స్వార్ధం కంటే సంసార బాధ్యత కోసమే అనే విషయం చాలా మందికి తెలియదు. కట్టుకున్న భార్యను సంతోష పెట్టడమే కాకుండా తనను నమ్మి వచ్చిన ఆమెకు ఏ లోటూ లేకుండా చూసుకోవాలనే ఆలోచనతోనే పగలనక, రాత్రనక కష్టపడి డబ్బు సంపాదిస్తారు మగవాళ్లు. అయితే వాళ్ల కష్టాల్లో పాలుపంచుకోవాల్సిన జీవిత భాగస్వామి భర్తకు జీవితం మీదే విరక్తి కలిగిస్తే ఏ మగాడైనా ఎందుకు ప్రాణాలతో ఉంటాడు..? భార్య ప్రవర్తనతో విసిగిపోయిన ఓ పాతికేళ్ల యువకుడు అజయ్ సింగ్ అనే నోయిడా నివాసి సూసైడ్ చేసుకున్నాడు. అయితే అతడి మనసును అంతగా క్షోభకు గురి చేసిన భార్య ఏం చేసిందో వీడియో రికార్డ్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో చూసి నెటిజన్లు కామెంట్స్ షేర్ చేసుకుంటున్నారు.

ప్రాణం తీసిన పెళ్లాం ప్రవర్తన..

పెళ్లిళ్లు కొందరి జీవితాల్లో అనూహ్యమైన మార్పులకు శ్రీకారం చుడుతుంది. మరికొందరు జీవితాల్లో ఊహించని మలుపులు తిప్పుతుంది. అయితే మారుతున్న జనరేషన్‌లో పెళ్లి తర్వాత అమ్మాయి, అబ్బాయిల ఆలోచన మారుతోంది. అక్రమ సంబంధాలు, వివాహేతర పరిచయాల కారణంగా భర్తలను మోసం చేసి నచ్చిన వాళ్లతో కాలక్షేపం చేసే ఆడవాళ్ల సంఖ్య పెరుగుతోందని సోషల్ మీడియాలో కనిపించే పోస్టులు చూస్తే అర్థమవుతోంది. ఉత్తరప్రదేశ్ నోయిడాకి చెందిన ఓ డెలివరీ బాయ్ తాను భార్య వల్ల విసిగిపోయానంటూ ఆత్మహత్యే తనకు దారి అంటూ ఉరివేసుకుని చనిపోయాడు. చనిపోయే ముందు భార్య చేసిన గలీజ్ పని గురించి వీడియో రికార్డ్ చేసి అందరితో షేర్ చేసుకున్నాడు.

ఒకేసారి అనేక మందితో..

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకి చెందిన అజయ్ సింగ్ అనే 25 ఏళ్ల డెలివరీ బాయ్ ఇదే సంవత్సరం ఫిబ్రవరి 9న వివాహం జరిగింది. రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్న అజయ్ సింగ్ పెళ్లి తర్వాత తన భార్య ప్రవర్తనలో మార్పును గమనించాడు. అంతే కాదు అనుకోకుండా ఆమె ఫోన్‌లో కాల్ హిస్టరీని పరిశీలించాడు. అంతే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అజయ్ సింగ్ తనను పెళ్లి చేసుకొని చీటింగ్ చేస్తోందని ఆమెకు చాలా మంది యువకులతో పరిచయం ఉందని.. తాను ఇంట్లో లేని సమయంలో వారితో మాట్లాడటం, చాటింగ్ చేయడం గుర్తించానని అజయ్ వీడియో ద్వారా తన ఆవేదనని అందరితో షేర్ చేసుకున్నాడు.

వైరల్ అవుతున్న వీడియో..

అయితే భార్య ప్రవర్తన నచ్చకపోయినప్పటికి సర్దుకుపోయే ఆలోచనతో ఆమెను పద్దతి మార్చుకోమని అనేకసార్లు చెప్పి చూశాడు అజయ్ సింగ్. అయితే నచ్చజెప్పినప్పటికి ఆమె వినకపోవడంతో తీవ్రమనస్తాపానికి లోనయ్యాడు. అదే విషయాన్ని సూసైడ్ చేసుకునే ముందు వీడియోలో చెప్పాడు. భార్య చేసిన అవమానం భరించలేక ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు అజయ్ సింగ్. డెలివరీ బాయ్ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తీవ్రస్థాయిలో కామెంట్స్ షేర్ చేస్తున్నారు. ఇలాంటి తప్పు చేస్తే భార్యను వదిలేసి హ్యాపీగా బతకాలని కాని చనిపోవడం ఏమిటని ఒకరు.. అందుకే మగవాళ్లు ఆడవాళ్లను హత్యలు చేస్తోందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరైతే భార్య బాధపెడితే నీకు నువ్వు శిక్ష వేసుకోవడం ఏంటీ అని సింపతీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed