Last Updated:
ఏకంగా 2 ఓటీటీలు నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ వేదికగా ‘ధురంధర్’ అన్‌కట్ వెర్షన్ ప్రసారం కానుందని, దీన్ని మే 22 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. దీంతో అసలేంటి ఈ అన్‌కట్ వెర్షన్? అనేది జనాల్లో చర్చనీయాంశం అయింది.
రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్‌లో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ అలజడి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా సంచలనంగా మారబోతోంది. ఓటీటీలో ‘ధురంధర్’ అన్‌కట్ వెర్షన్ రిలీజ్ అంటూ మరోసారి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఏకంగా 2 ఓటీటీలు నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ వేదికగా ‘ధురంధర్’ అన్‌కట్ వెర్షన్ ప్రసారం కానుందని, దీన్ని మే 22 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. దీంతో అసలేంటి ఈ అన్‌కట్ వెర్షన్? ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ సినిమా చూడాలా? ఈ అన్‌కట్ వెర్షన్ లో స్పెషల్ ఏంటి? ఎందుకు ఇలా రిలీజ్ చేస్తున్నారు? ఓటీటీ రూల్స్ ఏం చెబుతున్నాయి? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం..
థియేటర్, సెన్సార్ బోర్డు పరిమితులు: ఏ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందో, అది భారతీయ సెన్సార్ బోర్డు (CBFC) కఠినమైన నియమాలను అనుసరించాలి. సినిమాకు ‘U’, ‘UA’ లేదా ‘A’ సర్టిఫికెట్ పొందడానికి నిర్మాతలు చాలా హింసాత్మక సన్నివేశాలు, అసభ్య పదజాలం లేదా బోల్డ్ సీన్స్‌ను తొలగించాల్సి వస్తుంది.
డైరెక్టర్ అసలు విజన్: అయితే ‘Raw and Unseen’ వెర్షన్ ద్వారా దర్శకుడు నిజంగా రూపొందించిన కథను, ఎలాంటి కత్తిరింపులు లేకుండా ప్రేక్షకులకు చూపించవచ్చు. అంటే ‘ధురంధర్’ సినిమాకు సంబంధించి ఈ వెర్షన్‌లో థియేటర్లలో చూపించని హింసాత్మక, అన్‌సెన్సర్డ్ సీన్స్ ఉంటాయని అర్థం.
అంతేకాదు OTT ప్లాట్‌ఫార్మ్స్ (Netflix లేదా JioHotstar వంటి) కోసం ఇది ప్రేక్షకులను మళ్లీ ఆకర్షించే బిజినెస్ ప్లాన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా అన్‌కట్ వర్షన్ రిలీజ్ చేయడం వల్ల థియేటర్‌లో సినిమా చూసినవారు కూడా “ఈసారి కొత్తగా ఏముంది?” అని తెలుసుకోవడానికి మళ్లీ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఈ వర్షన్ కోసం మళ్లీ కొత్త సర్టిఫికెట్ తీసుకోవాలా? అంటే ఎస్ తప్పనిసరిగా తీసుకోవాలి అని రూల్స్ చెబుతున్నాయి. భారతదేశంలో దీనికి సంబంధించిన నియమాలు చాలా కఠినంగా మారాయి.
గతంలో థియేటర్లలో కత్తిరించిన వెర్షన్‌ను, సెన్సార్ లేకుండానే OTTలో విడుదల చేసేవారు. ఎందుకంటే OTTపై సెన్సార్ బోర్డుకు నేరుగా నియంత్రణ ఉండేది కాదు. కానీ Cinematograph (Amendment) Act వచ్చిన తర్వాత నియమాలు మారాయి. కొత్త సర్టిఫికెట్ తప్పనిసరి అయింది. ఒక సినిమా థియేటర్లలో ‘UA’ సర్టిఫికెట్‌తో రిలీజ్ అయి ఉంటే, అదే సినిమాకు OTTలో ‘Uncut’ లేదా మరింత హింసాత్మకమైన వెర్షన్ (అది ‘A’ కేటగిరీకి చెందితే) విడుదల చేయాలంటే, నిర్మాతలు CBFC నుంచి మళ్లీ కొత్త సర్టిఫికెట్ తీసుకోవాలి.
అదనంగా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లు IT Rules ప్రకారం తమ కంటెంట్‌ను తామే నియంత్రించాలి. సినిమాలో ఎక్కువ “Raw” కంటెంట్ ఉంటే, దానికి సంబంధించిన రేటింగ్‌ను (ఉదా: 18+) కూడా మార్చాలి. సో, ఈ రూల్స్ అన్నీ పాటిస్తూ ఇప్పుడు ధురంధర్ మూవీ అన్‌కట్ వర్షన్ ఓటీటీ ఎంట్రీ ఇస్తోందన్నమాట. 3.25 గంటల నిడివితో ఈ అన్‌కట్ వర్షన్ ఆకట్టుకోనుంది.
ఇక ఇదిలా ఉంటే ధురంధర్ 2 కూడా జూన్ 4, 2026న జియో హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఇది థియేటర్లలో ప్రదర్శితమైన సాధారణ సెన్సార్ వర్షన్‌తోనే ఓటీటీలోకి రాబోతోంది. ఈ పరిస్థితుల నడుమ మరోసారి జనాల్లో ధురంధర్ మూవీ హాట్ టాపిక్ అయింది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
May 21, 2026 12:40 PM IST













