Dhurandhar 2 OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన ధురంధర్ 2.. తెలుగులో చూడొచ్చు కానీ అక్కడే చిన్న ట్విస్ట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రీసెంట్ గా బాక్సాఫీస్ దాడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించిన ధురంధర్ 2 మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు.

News18
News18

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) చిత్రం సృష్టించిన కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు. ఈ చిత్రం బాలీవుడ్ దిగ్గజ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌ల లైఫ్ టైమ్ రికార్డులను తిరగరాసి, సరికొత్త చరిత్రను సృష్టించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ధురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం భారత్‌లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా సత్తా చాటింది. థియేటర్స్ బూజు దులిపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది.

థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో మే 14 అర్ధరాత్రి నుంచి ఈ చిత్రం ప్రసారం అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ తదితర భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ విదేశీ ప్రేక్షకులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇండియన్ ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.

ఈ సినిమా డిజిటల్ వెర్షన్ దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో ఉంది. అంటే థియేటర్లలో తొలగించిన కొన్ని సన్నివేశాలను కూడా కలిపి పూర్తి అన్‌కట్ వెర్షన్‌ను విడుదల చేశారని చెప్పుకోవచ్చు. దీంతో ఆడియన్స్ లో ఈ డిజిటల్ వెర్షన్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించగా.. ఆయన సరసన సారా అర్జున్‌ హీరోయిన్‌గా నటించింది. అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సో, చూడాలి మరి ధురంధర్ 2 థియేటర్స్ లో చూపించిన హంగామా ఓటీటీలో ఏ మేర చూపిస్తుందనేది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports