Last Updated:
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. ఆ వివరాలు చూస్తే..
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. థియేటర్లలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను దక్కించుకుంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న నాన్-ఇంగ్లీష్ (ఆంగ్లేతర) చిత్రంగా ‘ధురంధర్’ చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ కో-సీఈవో టెడ్ సరాండోస్ స్వయంగా వెల్లడించి, భారతీయ సినిమా స్థాయిని కొనియాడారు.














