Sunni NATO: సున్నీ నాటో ఆవిర్భావం. సౌదీ, తుర్కియే, పాకిస్థాన్ కొత్త సైనిక కూటమి.. భారత్‌‌కి సవాలు | | ACTPnews

సున్నీ నాటో ఆవిర్భావం. సౌదీ, తుర్కియే, పాకిస్థాన్ కొత్త సైనిక కూటమి.. భారత్‌‌కి సవాలు


Last Updated:

Sunni NATO: ఈ పాకిస్థాన్ కుదురుగా ఉండదు. మనసంతా కుళ్లే. కుట్రల మయం. కొత్తగా మరో ఎత్తుగడ. దీనికి సౌదీ, తుర్కియే తోడయ్యాయి. దేని లెక్కలు దానివి. ముంచేది మన కొంపనే. భారత్‌కి పెను సమస్య. మరి మనం ఏం చెయ్యాలి. అసలేంటి ప్రాబ్లం?

సున్నీ నాటో ఆవిర్భావం. సౌదీ, తుర్కియే, పాకిస్థాన్ కొత్త సైనిక కూటమి.. భారత్‌‌కి సవాలు
సున్నీ నాటో ఆవిర్భావం. సౌదీ, తుర్కియే, పాకిస్థాన్ కొత్త సైనిక కూటమి.. భారత్‌‌కి సవాలు

ఆగస్టు 7న సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో జరిగిన ఒక కీలక సమావేశంలో సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్థాన్ దేశాలు ఒక చారిత్రాత్మక ఉమ్మడి రక్షణ ఒప్పందం (Mecca Joint Defence Agreement)పై సంతకాలు చేశాయి. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్వయంగా పాల్గొన్న ఈ ఒప్పందాన్ని అంతర్జాతీయ మీడియా వ్యవహారికంగా ‘సున్నీ నాటో’ (Sunni NATO) ఆవిర్భావంగా అభివర్ణిస్తోంది. వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, ఈ ఒప్పందం సైనిక శిక్షణ, నిఘా సమాచార మార్పిడి, రక్షణ సాంకేతికత బదిలీ వంటి అంశాలలో ఈ 3 దేశాలు కలిసి పనిచేసేలా మార్గం సుగమం చేసింది. దీని వల్ల సౌదీ అరేబియా, తుర్కియే, పాకిస్థాన్ దేశాలు ఆర్థికంగా, సైనికంగా బాగానే ఉంటాయి. కానీ, ఈ సరికొత్త ఇస్లామిక్ కూటమి భారతదేశ భద్రతకు, దౌత్య విధానానికి తీవ్రమైన ప్రమాదంగా మారుతుందనే విశ్లేషణలు వస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports