Last Updated:
Dream11 | డ్రీమ్11 యూజర్లకు కీలక అప్‌డేట్ వచ్చింది. రియల్ మనీ కాంటెస్టులను నిలిపివేసిన తర్వాత, ఇప్పుడు స్పోర్ట్స్ అభిమానుల కోసం కొత్త గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌గా డ్రీమ్11 మారుతోంది.
డ్రీమ్11 కొత్త దారిలోకి అడుగుపెట్టింది. రియల్ మనీ గేమింగ్, నగదు బహుమతులతో కూడిన ఫాంటసీ స్పోర్ట్స్ కాంటెస్టులను ఆపేసిన ఏడాది తర్వాత, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ అభిమానులను కలిపే ప్లాట్‌ఫామ్‌గా మారిందని పీటీఐ వెల్లడించింది. ఇకపై డ్రీమ్11లో ప్రైజ్ మనీ ఉండదు. స్పోర్ట్స్ కంటెంట్, లైవ్ స్ట్రీమింగ్, స్కోర్లు, స్టాట్స్, కమ్యూనిటీ ఫీచర్లు, స్పోర్ట్స్ అనుభవాలు, సోషల్ కాంటెస్టులపై సంస్థ దృష్టి పెట్టనుంది. గురువారం డ్రీమ్11 ఈ మార్పును ప్రకటించింది. ఇంతకాలం ఫాంటసీ స్పోర్ట్స్‌పై ప్రధానంగా దృష్టి పెట్టిన ప్లాట్‌ఫామ్, ఇప్పుడు గ్లోబల్ స్పోర్ట్స్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌గా మారింది.














