Drishyam 3 OTT Release Date: ఓటీటీ లోకి దృశ్యం 3.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మే 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన దృశ్యం 3 ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి సిద్ధమవుతోంది. మరి ఆ వివరాలు చూద్దామా..

News18
News18

ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ఏదైనా ఉందంటే అది ‘దృశ్యం’ అనే చెప్పాలి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. థియేటర్లలోనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లోనూ ఈ సిరీస్ ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ థ్రిల్ అందించింది. ఈ క్రేజీ సిరీస్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘దృశ్యం 3’. మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం మే 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

మొదటి రెండు భాగాలతో పోలిస్తే ఈ మూడో పార్ట్‌కు ఆడియన్స్ నుండి కొంతవరకు మిక్స్ డ్ టాక్ (మిశ్రమ స్పందన) వచ్చింది. గత చిత్రాల తరహాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంతగా పండలేదని కొందరు కామెంట్స్ చేసినప్పటికీ, వసూళ్లలో మాత్రం ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, విడుదలైన కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 235.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఆడనప్పటికీ, మలయాళంలో మాత్రం ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల జాబితాలో ‘దృశ్యం 3’ టాప్ ప్లేస్‌కు చేరువవుతోంది.

థియేటర్లలో సత్తా చాటుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని డిజిటల్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. ‘దృశ్యం 3’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) భారీ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ అయిన 30 నుండి 35 రోజుల తర్వాత ఓటీటీ లో విడుదల చేసేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియా సమాచారం ప్రకారం, ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జూన్ మూడో వారం లేదా చివరి వారంలో (జూన్ 18 లేదా జూన్ 25 నుంచి) అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ ఒకేసారి ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. త్వరలోనే మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.

ఉత్కంఠ రేకెత్తించే కథాంశం: ఈ మూడో భాగంలో జార్జ్‌కుట్టి (మోహన్ లాల్) ఒక సినిమా నిర్మాతగా మారి, వరుణ్ హత్య కేసు నుండి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి సరికొత్త మైండ్ గేమ్ ఆడతాడు. అయితే, చట్టం, పాత శత్రువులు అతని కుటుంబాన్ని మళ్లీ ఎలా ఇబ్బందుల్లోకి నెట్టారు, ఈసారి జార్జ్‌కుట్టి పోలీసుల వ్యూహాలను ఎలా తిప్పికొట్టాడు అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా రూపొందింది. ఆశీర్వాద్ సినిమాస్, పనోరామా స్టూడియోస్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ సరసన మీనా కథానాయికగా నటించగా.. అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్, సిద్ధిఖ్, మురళీ గోపి ప్రధాన పాత్రలు పోషించారు. అనిల్ జాన్సన్ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed