మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి తన సొంత పట్టణం టికంగఢ్లో సోమవారం (ఏప్రిల్ 6, 2026) అరుదైన రీతిలో కనిపించారు. తన బంగ్లా ముందు ఉన్న రోడ్డుపై తోపుడు బండిపై కూర్చుని ఆమె స్వయంగా పోహ, జిలేబీలు అమ్మారు. ఇటీవల స్థానిక మున్సిపల్ అధికారులు ఆ ప్రాంతంలోని పేద వ్యాపారుల బట్టీలను తొలగించడాన్ని నిరసిస్తూ ఆమె ఈ చర్యకు దిగారు. “పేదల నోటికాడ కూడు లాక్కోకండి” అని అధికారులను హెచ్చరించిన ఆమె, స్వయంగా వ్యాపారం చేసి వారికి మద్దతు తెలిపారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా సామాన్యుడిలా మారి నిరసన తెలపడంతో అధికారులు వెనక్కి తగ్గి, తొలగించిన షాపులను తిరిగి పునరుద్ధరించడం విశేషం.
Source link
Ex-CM Uma Bharti : రోడ్డుపై పోహ-జిలేబీ అమ్మిన మాజీ సీఎం ఉమాభారతి! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










