Extramarital Affair: భార్యకు తెలియకుండా వివాహేతర సంబంధం.. ఆ సీక్రెట్ కెమెరాతో దొరికిపోయాడు! | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Extramarital Affair: వివాహేతర సంబంధాలు పెట్టుకునేవారు.. తమ యవ్వారం ఎవరికీ తెలియదు అనుకుంటారు. కానీ అడ్డగోలు వ్యవహారాలు ఎప్పటికైనా బయటపడతాయి. అలా ఓ భార్య చేసిన తెలివైన పనితో.. భర్త యవ్వారం బయటపడింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తమిళనాడు.. కడలూరుకి చెందిన ఓ మహిళ తన భర్త వివాహేతర సంబంధాన్ని కనిపెట్టేందుకు తెలివైన ఎత్తుగడ వేసింది. నిజానికి ఆమె భర్త కానిస్టేబుల్. పేరు అరుళ్ ప్రసాద్. 2024లో అతన్ని పెళ్లి చేసుకుంది అభినయ. ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న ఆమె.. పెళ్లి తర్వాత.. ఉద్యోగం రీత్యా.. దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. ఐతే.. అరుళ్ ప్రసాద్.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం బయటపడకుండా ఉంటుందా.. కొన్ని నెలల కిందట.. చెన్నై వచ్చిన ఆమెకు విషయం తెలిసింది. దాంతో భర్తను నిలదీసింది. పెద్ద గొడవ అయ్యింది. ఇంకెప్పుడూ ఇలా చెయ్యను అని మాట ఇచ్చాడు. కానీ ఆమెకు అతనిపై డౌట్ వచ్చింది. దాంతో ఆమె ఇంట్లో సీక్రెట్ కెమెరా ఒకటి అమర్చింది. దానికి ఒక మొబైల్ యాప్ ద్వారా కనెక్టివిటీ పెట్టింది. తద్వారా తాను దుబాయ్‌లో ఉండగా.. వివాహేతర సంబంధం కొనసాగిస్తే, తనకు తెలుస్తుందని ఆమె ప్లాన్ చేసుకుంది.

అభినయ దుబాయ్ వెళ్లాక.. ఆ యాప్ అక్కడ పనిచెయ్యలేదు. ఇండియాలోనే పనిచేసేలా దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. దాంతో ఆమె అనుకున్న ప్లాన్ బెడిసికొట్టింది. మరెలా అని ఆలోచించిన ఆమె.. వీలు చూసుకొని.. రహస్యంగా చెన్నై వచ్చింది. ఓ హోటల్‌లో దిగింది. ఈ విషయం తెలియని అరుళ్ ప్రసాద్.. ఇటీవల ఓ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు. ఆమెతో రాసలీలలు సాగించాడు. ఆ విషయం రహస్య కెమెరాకి చెక్కింది. యాప్ ద్వారా ఫుటేజ్‌ని సేకరించింది అభినయ. దాని ఆధారంగా భర్తను నిలదీద్దామని వెళ్లింది. ఐతే.. ఆ వీధిలో ఆమె రావడాన్ని గమనించిన అరుళ్.. వెనక డోర్ నుంచి పారిపోయాడు.

ఇవి కూడా చదవండి: Amazon Molly: సైంటిస్టులు షాక్. మగతోడు లేకుండా పిల్లల్ని కంటోంది.. ఇదేం చేపరా నాయనా.!

ఇక ఇలాంటి భర్తతో వేగలేను అనుకున్న ఆమె.. తిన్నగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. వళసరవాక్కం పోలీసులు కేసు రాశారు. ఆ పారిపోయిన పోలీస్ కోసం వెతుకుతున్నారు. ఐతే.. అతను పోలీస్ కాబట్టి.. దొరుకుతాడా లేదా అనేది డౌట్ ఉంది. పోలీస్ తెలివితేటలు చూపించి.. అతను తప్పించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా నమ్మకంగా ఉండాల్సిన భర్త కాస్తా.. అడ్డగోలు వ్యవహారాలు చేసి.. భార్యకు దొరికి, పారిపోయాడు. నమ్మి పెళ్లి చేసుకున్న ఆమె నిలువునా మోసపోయింది. ఐతేనేం.. ఇప్పుడు ఆమె ధైర్యంగా పోరాడుతోంది. అలాంటి భర్తను ఆమె త్వరలోనే వదిలించుకొని.. కొత్త జీవితం ప్రారంభించే ఛాన్స్ ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *