FIFA World Cup 2026: ప్రపంచకప్ రారాజులు వీరే.. గోల్డెన్ బూట్, బాల్, గ్లవ్ విజేతల వీరే | క్రీడా వార్తలు | ACTPnews

ఫిఫా ప్రపంచకప్ 2026


Last Updated:

FIFA World Cup 2026: ఫుట్‌బాల్ ప్రపంచంలో స్పెయిన్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన 2026 ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫెర్రాన్ టోర్రెస్ చేసిన ఏకైక గోల్‌తో అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి, స్పెయిన్ రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

ఫిఫా ప్రపంచకప్ 2026
ఫిఫా ప్రపంచకప్ 2026

ఫైనల్ మ్యాచ్ 106వ నిమిషంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఫెర్రాన్ టోర్రెస్, బంతిని నేరుగా గోల్ పోస్ట్‌లోకి పంపి స్పెయిన్ అభిమానులకు మరపురాని విజయాన్ని అందించాడు. మ్యాచ్ మొదటి నుండి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ‘లా రోజా’ (స్పెయిన్) జట్టు ఈ విజయం ద్వారా ఫుట్‌బాల్ చరిత్రలో తమ పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. మహా సంగ్రామం ముగిసిన అనంతరం ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు అందించిన ప్రధాన అవార్డుల వివరాలు ఇక్కడ చూడవచ్చు:

1. గోల్డెన్ బూట్ : కిలియన్ ఎంబాపె (ఫ్రాన్స్)

ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపె వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచ కప్‌లో ‘గోల్డెన్ బూట్’ అవార్డును గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో ఎంబాపె అత్యధికంగా 10 గోల్స్ సాధించాడు. గోల్డెన్ బూట్ రేసులో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి (8 గోల్స్) నుండి ఎంబాపె తీవ్ర పోటీని ఎదుర్కొన్నాడు. అయితే మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఎంబాపె చేసిన రెండు గోల్స్ అతనికి ఈ అవార్డును ఖాయం చేయగా, ఫైనల్‌లో మెస్సి గోల్ చేయలేకపోవడం కలిసివచ్చింది.

2. గోల్డెన్ బాల్: రోడ్రి (స్పెయిన్)

ప్రపంచ కప్‌లో అత్యుత్తమ ఆటగాడికి ఇచ్చే ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ బాల్’ అవార్డును స్పెయిన్ స్టార్ మిడ్‌ఫీల్డర్ రోడ్రి సొంతం చేసుకున్నాడు. మైదానంలో ఆట వేగాన్ని నియంత్రించడమే కాకుండా, తన నాయకత్వ పటిమతో అర్జెంటీనాను ఓడించి స్పెయిన్‌ను విశ్వవిజేతగా నిలబెట్టడంలో రోడ్రి అత్యంత కీలక పాత్ర పోషించాడు.

3. గోల్డెన్ గ్లవ్: ఉనాయ్ సీమన్ (స్పెయిన్)

టోర్నమెంట్ ఉత్తమ గోల్‌కీపర్‌కు ఇచ్చే ‘గోల్డెన్ గ్లోవ్’ అవార్డు స్పెయిన్ గోల్‌కీపర్ ఉనాయ్ సీమన్ వశమైంది. ఈ ప్రపంచ కప్‌లో ఆడిన 8 మ్యాచుల్లో సీమన్ కేవలం ఒక్క గోల్ మాత్రమే ప్రత్యర్థులకు ఇచ్చాడు. ఫైనల్‌లో అర్జెంటీనాతో సహా ఏకంగా 7 మ్యాచుల్లో క్లీన్ షీట్స్ (ప్రత్యర్థులను ఒక్క గోల్ కూడా చేయనివ్వకుండా అడ్డుకోవడం) నమోదు చేశాడు. స్పెయిన్ డిఫెన్స్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఉనాయ్ సీమన్ ప్రతిభే నిదర్శనం.

4. బెస్ట్ యంగ్ ప్లేయర్: పావు కుబార్సీ (స్పెయిన్)

స్పెయిన్ జట్టుకు చెందిన 19 ఏళ్ల సెంట్రల్ డిఫెండర్ పావు కుబార్సీ ‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును దక్కించుకున్నాడు. స్పెయిన్ జట్టు డిఫెన్స్‌ను ప్రత్యర్థులు ఛేదించలేకపోవడానికి ఈ టీనేజర్ చూపిన చొరవ, మానసిక పరిణతి ప్రధాన కారణం. లైమ్‌లైట్‌లో లేకపోయినప్పటికీ, శాంతంగా ఉంటూనే స్పెయిన్ ట్రోఫీ గెలిచే ప్రయాణంలో ఎలాంటి అవరోధాలు లేకుండా తన బాధ్యతను అత్యద్భుతంగా నిర్వర్తించాడు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *