Flydubai plane attack: ఫ్లైదుబాయ్ విమానంపై దాడి ఉగ్రవాద చర్యే.. వెనకుండి నడిపించిన వారికి భారీ మూల్యం తప్పదు: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు! | | ACTPnews

News18


Last Updated:

దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో భారత పైలట్ స్మిత్ మచ్చార్‌పై జరిగిన దాడిని యూఏఈ ఉగ్రవాద చర్యగా ప్రకటించింది. విమానాన్ని కూల్చేందుకు కుట్ర పన్నిన శక్తులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు.

News18
News18

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జెడ్-1073 విమానంలో భారత కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై ఒమన్‌కు చెందిన కో-పైలట్ జరిపిన దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రస్థాయిలో స్పందించారు. దాడి వెనుక ఉన్న అసలు నిజాలు దర్యాప్తులో క్రమంగా వెలుగులోకి వస్తున్నాయని ఆయన శుక్రవారం విడుదల చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. నిందితుడు తీవ్ర ఇస్లామిక్ భావజాలంతో మతోన్మాదిగా మారాడని, 174 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని గాల్లోనే కూల్చివేయడానికి కుట్ర పన్నాడని నెతన్యాహు స్పష్టం చేశారు.

ఈ దాడి వెనుక బాహ్య శక్తుల హస్తం ఏదైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. నిందితుడిని ఉసిగొల్పి నడిపించిన మూలకారకులు ఎవరైనా సరే ఊహించని రీతిలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

విమానంపై దాడి ఉగ్రవాద చర్యే: యూఏఈ

యూఏఈ అధ్యక్ష సలహాదారు అన్వర్ గర్గాష్ సైతం ఈ దాడిని తీవ్రమైన “ఉగ్రవాద చర్య”గా అభివర్ణించారు. ఆ క్లిష్ట సమయంలో భారత పైలట్ స్మిత్ మచ్చార్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, బాధ్యతాయుత ప్రవర్తన వెలకట్టలేనిదని కొనియాడినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. తీవ్ర గాయాల పాలైనప్పటికీ పెను ఉగ్ర విలయాన్ని అడ్డుకుని వందలాది ప్రాణాలను కాపాడిన స్మిత్ నిజమైన హీరో అని ఎక్స్ వేదికగా ప్రశంసించారు.

ఈ ప్రమాదకర ఘటనపై యూఏఈ న్యాయ విభాగం అధికారికంగా విచారణ ప్రారంభించింది. ముందస్తు ప్రణాళికతోనే దాడి చేశారా, ఏదైనా ఉగ్రవాద ముఠాతో సంబంధాలు ఉన్నాయా అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తోంది. దర్యాప్తు కొనసాగుతున్నందున నిరాధార పుకార్లు, కథనాలు ప్రచారం చేయవద్దని అధికారులు ప్రజలను కోరారు.

కాక్‌పిట్‌లో జరిగిన పెనుగులాటలో తీవ్ర రక్తస్రావం జరుగుతున్నా స్మిత్ మచ్చార్ డోర్ లాక్ తెరిచి ప్రయాణికులను కాపాడటంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్‌లో సురక్షితంగా దించగలిగారు. ప్రస్తుతం అబుదాబిలో చికిత్స పొందుతున్న స్మిత్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed