Last Updated:
ఎలాంటి హంగామా లేకుండానే సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఓటీటీలోకి వచ్చేసింది గాయపడ్డ సింహం మూవీ. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ చూస్తే..
ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి కనిపిస్తుంటే, మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కూడా తాజా చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంటాయి. కొన్ని సినిమాలు ముందుగానే తమ డిజిటల్ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తే, మరికొన్ని మాత్రం ఎలాంటి హంగామా లేకుండానే సడన్ సర్ప్రైజ్ ఇస్తుంటాయి. ఇప్పుడు అలాంటి జాబితాలో చేరింది గాయపడ్డ సింహం.
తరుణ్ భాస్కర్, J. D. చక్రవర్తి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తాజాగా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులో ఉంది. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను ప్రేక్షకులు వీక్షించవచ్చు.
ఈ చిత్రానికి థియేటర్లలో యూత్ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా కామెడీ, పొలిటికల్ సెటైర్, ఎమోషనల్ డ్రామాను మిక్స్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా ఈ మూవీకి సంబంధించిన కొన్ని డైలాగ్స్, సన్నివేశాలు వైరల్ అయ్యాయి.
దరహాస్ పాత్రలో తరుణ్ భాస్కర్ కనిపిస్తారు. గాయత్రి (మానసా చౌదరి)తో ప్రేమలో ఉన్న అతను, ఆమె తండ్రి పెట్టిన షరతు మేరకు అమెరికాలో సెటిల్ కావాలని నిర్ణయించుకుంటాడు. వీసా తీసుకుని అమెరికా వెళ్లిన దరహాస్, కేవలం 34 గంటల్లోనే తిరిగి భారత్‌కు రావాల్సి వస్తుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న వలస విధానాల కారణంగా డిపోర్ట్ అయిన భారతీయ విద్యార్థుల్లో అతడూ ఒకడిగా మారుతాడు.
అక్కడి నుంచి కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. తన జీవితాన్ని మార్చేసిన ట్రంప్‌పై పగ తీర్చుకోవాలని దరహాస్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడి జీవితంలోకి బ్రూటల్ ధర్మ (జేడీ చక్రవర్తి) అనే మాఫియా డాన్ ఎంటర్ అవుతాడు. ఇక భైరవ దాస్ పాత్రలో శ్రీ విష్ణు, శాలినిగా ఫరియా అబ్దుల్లా కనిపిస్తారు. వీరి పాత్రలు కథలో కీలక మలుపులకు కారణమవుతాయి. హాస్యం, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరించే అవకాశముంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













