Girl Shaves Head: ఇంట్లో పెళ్లి ప్లాన్ చేశారని గుండు గీయించుకుంది.. అమ్మాయి వీడియో వైరల్ | ట్రెండింగ్ | ACTPnews

Viral Video


Last Updated:

Viral Video: చూడటానికి చక్కగా అందంగా ఉన్న అమ్మాయి గుండు చేయించుకుంది. నిజమే తన ఇష్టపూర్వకంగా తలవెంట్రుకలు తీయించుకుంటున్న వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే ఆమె ఎందుకు గుండు గీయించుకుందో క్యాప్షన్ పెట్టింది.

Viral Video
Viral Video

Viral Video: ఈ జన్ జీ జనరేషన్‌లో ఏదో విధంగా పాపులర్ అవ్వాలనే కోరిక టీనేజర్స్‌లో పుష్కలంగా కనిపిస్తోంది.దీనికి తోడు సోషల్ మీడియా అందరికి ఉచిత వేదికగా మారడంతో ప్రతీ ఒక్కరూ తమ టాలెంట్‌ని, విలక్షణమైన వ్యక్తిత్వాన్ని, ప్రాంక్ వీడియోలను షేర్ చేస్తూ వైరల్ అవ్వాలని చూస్తున్నారు. ఇలాంటి ప్రయత్నంలో భాగంగానే ఓ యువతి గుండు గీయించుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. కీర్తన మీనన్ అనే అకౌంట్‌లో చేసిన ఓ వీడియో కొందరికి అనుమానాన్ని కలిగిస్తుంటే మరికొందరికి హాస్యాన్ని తెప్పిస్తోంది. అసలు అమ్మాయి గుండు ఎందుకు చేయించుకుందో తెలియదు కాని ఆమె మాత్రం తనకు చెప్పకుండా అమ్మ పెళ్లి ఫిక్స్ చేసిందని అందుకే ఈపని చేయాల్సి వచ్చిందంటూ క్యాప్షన్ పెట్టింది. దీనిపై విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి.

అమ్మాయి గుండు వీడియో వైరల్..

ఏం చేసైనా అందరికి మనం తెలియాలి. అందుకోసం ఏం చేయాలి..? ఎలాంటి ప్లాన్ వేయాలి..? ఆలోచనకే తట్టలేనన్ని ఐడియాలు ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు వస్తున్నాయి. అయితే తాజాగా కీర్తన మీనన్ అనే ఇన్టాగ్రామ్ హ్యాండిల్‌లో యువతి గుండు చేయించుకుంటున్న వీడియో షేర్ చేసింది. అయితే ఆ వీడియోతో పాటు తనకు పెళ్లి పీటలు ఎక్కడానికి ఇష్టం లేదని అందుకే గుండు కొట్టించుకుందనే ప్రచారం జరుగుతోంది. కీర్తన మీనన్ షేర్ చేసిన ఈ వీడియోను చూసి కొందరు ముక్కున వేలేసుకుంటుంటే, మరికొందరు మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

జరిగింది ఇదే..

వైరల్ అవుతున్న వీడియోలో చూడ తక్కగా ఉన్న ఓ యువతి కూర్చొని నవ్వుతూ బార్బర్‌తో గుండు గీయించుకుంది. తలపై నిగనిగలాడే జుట్టును తొలగిస్తుంటే ఆమె ముసిముసినవ్వులు నవ్వుతూ వీడియోకి ఫోజులిచ్చింది. అయితే ఈ వీడియో మొత్తాన్ని మూడో వ్యక్తి ద్వారా రికార్డ్ చేసి తర్వాత సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీన్ని చూసి ఎవరూ పట్టించుకోవడం లేదు. కాని ఆమె వీడియోకి అదనంగా పెట్టిన క్యాప్షన్ వైరల్ అవుతోంది. “పివోవి (పాయింట్ ఆఫ్ వ్యూ): మా అమ్మ నా పెళ్లి ప్లాన్ చేసింది”అనే టెక్స్ట్ పోస్ట్ చేసింది. అయితే వీడియో ద్వారా ఆమె ఏం చెప్పాలనుకుందో తెలియదు కాని.. గుండు చేస్తుంటే ఆమె ముఖంలో చిరాకు, బాధ కనిపించకపోగా హ్యాపీగా నవ్వుతున్నట్లుగా ఉంది.

నిజమా.. వ్యూస్ కోసమేనా..?

ఇప్పటికి మన దేశంలో చాలా వరకూ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే జరుగుతున్నాయి. కొన్నిచోట్ల మాత్రమే ప్రేమించిన వాళ్ల పెళ్లిళ్లు కూడా పెద్దల అంగీకారంతోనే జరుగుతున్నాయి. అయితే కీర్తన మీనన్ పోస్ట్ తో పాటు కామెంట్‌కి పరమార్ధం చూసుకుంటే తనకు ఇష్టం లేకుండా తల్లి మ్యారేజ్ ఫిక్స్ చేసిందని.. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని అమ్మాయి ఈవిధంగా గుండు చేయించుకొని వివాహం జరగకుండా చూడాలని ప్లాన్ వేసిందని కొందరు అనుకుంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది..? ఆమె ఈ నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉన్నట్లుగా అర్ధమవుతోంది. నిజంగానే పెళ్లి చూపులు తప్పించుకోవడానికి చేసిన పనా? లేక తిరుపతి వంటి దేవాలయాల్లో మొక్కులు తీర్చుకోవడమా? క్యాన్సర్ రోగుల కోసం జుట్టును దానం చేసే చారిటీ కార్యక్రమమా? లేదా కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం క్రియేట్ చేసిన వీడియోనా? అనేది తెలియడం లేదు.

నెటిజన్ల రియాక్షన్ ఇదే..

కారణం ఏదైనా అమ్మాయి గుండు చేయించుకోవడం కాస్త ఆశ్చర్యకరమైన వార్తే. అందుకే ఈవీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక వీడియో చూసి నెటిజన్లు కామెంట్ల రూపంలో వస్తున్నాయి. ఒకరు “నీ ధైర్యానికి జోహార్లు సోదరి” అంటుంటే..మరొకరు అసలు విషయం ఏంటో తెలియకుండా ఇంత తొందరగా ఒక ముగింపునకు రావడం సరికాదంటున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ నిజం కాకపోవచ్చని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా కీర్తన మీనన్ గుండు వీడియో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports