Last Updated:
UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షకు భారతీయులే అర్హులా? నేపాల్, భూటాన్ లేదా పాకిస్థాన్ నుంచి వచ్చిన వారికి IAS, IPS, IFSలో అవకాశం ఉందా? పూర్తి వివరాలు తెలుసుకోండి.
భారతదేశంలో IAS, IPS వంటి అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది లక్షలాది మంది UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతుంటారు. అయితే పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, పాకిస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తులు ఈ పరీక్ష రాయగలరా అనే అంశంపై అభ్యర్థుల్లో తరచూ సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ముఖ్యంగా విదేశీ పౌరులకు భారత బ్యూరోక్రసీలో చేరే అవకాశం ఉందా అనే ప్రశ్నకు UPSC నిబంధనలు స్పష్టమైన సమాధానాన్ని ఇస్తున్నాయి. సేవను బట్టి జాతీయతకు సంబంధించిన నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి.














