దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుంది. ప్రస్తుతం ఉన్న GOBARdhan యూనిఫైడ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (gobardhan.sbm.gov.in)లో ప్లాంట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సాధారణంగా గ్రామ పంచాయతీ, జిల్లా స్థాయి అధికారులు, SHGలు, FPOలు, కూపరేటివ్ల ద్వారా.. ప్రాజెక్ట్ ప్లాన్ సిద్ధం చేసి, సమర్పించాలి. డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR), భూమి పత్రాలు, బ్యాంక్ వివరాలు అవసరం. అలాగే ముడి అందుబాటులో ఉందో, లేదో చూసుకోవాలి. MSMEలకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం ఉంటుంది. పాత GOBAR-DHANలో గ్రామ స్థాయి బయోగ్యాస్ ప్లాంట్లకు సహాయం ఉన్నట్లే ఇప్పుడు CBG స్థాయికి కూడా సహాయాన్ని విస్తరించారు. అధికారిక నోటిఫికేషన్ల కోసం pib.gov.in, mopng.gov.in సైట్లను పరిశీలించాలి.













