తిరుమలలో గోకులాష్టమి వేడుకలు.. ఆ రెండు సేవలు రద్దు.. భక్తులకు కీలక సమాచారం..! Gokulashtami Tirumala. | | ACTPnews

News18


Last Updated:

తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు..!

+

News18

తిరుమలలో గోకులాష్టమి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంతో పాటు గోగర్భం డ్యామ్‌ సమీపంలోని ఉద్యానవనంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కాళీయమర్ధనుడైన శ్రీకృష్ణస్వామికి ఉదయం పంచాభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం అక్కడ ఉట్లోత్సవం నిర్వహించారు.

శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహించనున్నారు. అనంతరం ప్రబంధ శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానం ఘనంగా చేపట్టనున్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతాన్ని వైదికులు స్వామివారికి నివేదిస్తారు.

శనివారం సాయంత్రం తిరుమలలో మరోసారి ఉట్లోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య జరిగే ఈ వేడుకలో శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ ఉట్లోత్సవాన్ని తిలకించనున్నారు. గోకులాష్టమి, ఉట్లోత్సవం వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నిర్వహించాల్సిన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది. దీంతో గోకులాష్టమి సందర్భంగా తిరుమలలో ప్రత్యేక పూజలు, ఉట్లోత్సవాలతో ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది.

మరోవైపు గోకులాష్టమి పర్వదినం సందర్భంగా తిరుమలకు భక్తుల రాక పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, మాడ వీధుల్లో భక్తుల సందడి కనిపించింది. గోవింద నామస్మరణతో తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రత్యేక పూజలు, ఉట్లోత్సవం వంటి వేడుకలు ఉండటంతో భక్తుల్లో మరింత ఆసక్తి నెలకొంది. శ్రీవారి దర్శనంతో పాటు గోకులాష్టమి కార్యక్రమాలను వీక్షించేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports