Gossip: నేటితరం కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ తో గాసిప్ మూవీ.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో వస్తున్న కొత్త సినిమా గాసిప్. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.

News18
News18

మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వైభవ్ సినీ స్కల్ప్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై యతి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘గాసిప్ . నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమ కథతో మేళవిస్తూ సోషల్ సెటైర్ గా డైరెక్టర్ వైభవ్ కౌండిన్య ద్వారా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇప్పటికే విడుదలైన సిప్పు సిప్పు సాంగ్ ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేస్తూ ఈ సినిమా నుంచి సిప్పు సిప్పు ఫుల్ లిరికల్ సాంగ్ ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. శక్తి కాంత్ కార్తీక్ స్వరపరిచిన ఈ ఎనర్జెటిక్ పబ్ డాన్స్ ట్రాక్‌కు కాసర్ల శ్యామ్ అందమైన సాహిత్యాన్ని అందించగా సింగర్ మాళవిక వోకల్స్ తో పాటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

సోషల్ సెటైర్ గా చిత్రీకరించిన “గాసిప్” అనే సినిమాలో మొదటి సాంగ్ గా సిప్పు సిప్పు అనే సాంగ్ వస్తుంది. గాసిప్ అనే ఈ సినిమా ఒక మిడిల్ క్లాసు అమ్మాయి చుట్టూ తిరిగే కథతో యూత్ కు మాత్రమే కాకుండా కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా తిర్చితిద్దుతున్నారు. ఈ పాట చాలా ఫ్రెష్ గా ఉండడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సునీల్ సున్నపు మాస్టర్, ఫల్గుణి బంగెర కొరియోగ్రఫీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో రాశి సింగ్, రవివర్మలతో పాటు టాలీవుడ్ నుంచి ప్రముఖ నటులు భాగమవుతున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed