Gudivada Amarnath : అమరావతి దేశంలోనే అతిపెద్ద స్కాం! అమర్నాథ్ ఫైర్! | ACTPnews

Gudivada Amarnath  : అమరావతి దేశంలోనే అతిపెద్ద స్కాం! అమర్నాథ్ ఫైర్!



మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్అమరావతి రాజధానిపై నిప్పులు చెరిగారు. అమరావతి అనేది దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం అని, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే కూటమి ప్రభుత్వం అక్కడ గ్రాఫిక్స్ చూపిస్తోందని విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ (Machilipatnam, Vijayawada, Guntur) హబ్ ఆలోచనతో చంద్రబాబులో వణుకు మొదలైందని ఆయన ఎద్దేవా చేశారు. 110 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని క్యాపిటల్ జోన్గా మార్చాలన్న జగన్ విజన్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. అవినీతి కోటలు బద్ధలవుతాయనే భయంతోనే చంద్రబాబు ‘మావిగన్’ ప్రతిపాదనపై విమర్శలు చేస్తున్నారని, అభివృద్ధిని వికేంద్రీకరించడమే తమ పార్టీ లక్ష్యమని అమర్నాథ్ స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports