రోహిణి ఏడుస్తూ, జుట్టు చెదిరిపోయి రావడం చూసి విద్య షాక్ అయ్యి “ఏమైంది?” అని అడిగింది. “నేను ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది, నా బాగోతం మొత్తం బయటపడింది. ఆ అత్తయ్య నన్ను మెడ పట్టుకుని బయటకు తోసేసింది. కోట్లు తెస్తానని నమ్మింది, నా దగ్గర రూపాయి లేదని తెలియగానే నన్ను రోడ్డు మీద పడేసింది” అని రోహిణి రోదించింది. అయితే విద్య ఓదార్చకుండా, “అబద్ధాలతో కట్టుకున్న కాపురం ఎంతో కాలం నిలవదని ముందే చెప్పా కదా, ఇప్పటికైనా మారు” అని క్లాస్ పీకింది. దాంతో రోహిణి ఎదురు తిరిగి విద్యపైనే కోపం చూపించి, “నేను ఓడిపోలేదు, మా మావయ్య ఎలాగైనా నన్ను మళ్లీ ఇంట్లోకి తీసుకెళ్తాడు” అని బిల్డప్ ఇచ్చింది. (Photo Credit: Gunde Ninda Gudigantalu Serial Star maa, Jio + Hotstar)













