Harish Rao Fires On Jupally Krishna Rao : సబ్జెక్ట్ లేక జూపల్లి తోక ముడిచాడు..! | ACTPnews

Harish Rao Fires On Jupally Krishna Rao : సబ్జెక్ట్ లేక జూపల్లి తోక ముడిచాడు..!



మంత్రి జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురు ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందన్న జూపల్లి, ఈరోజు 7 లక్షల కోట్లు అంటూ ఒక్కరోజులోనే లక్ష కోట్ల అప్పు తగ్గించేశారని ఎద్దేవా చేశారు. ఈరోజు చర్చకు వచ్చి ఉంటే అసలు అప్పు 4 లక్షల కోట్లేనని తేలిపోయేదన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే, జూపల్లి కృష్ణారావు మధ్యలోకి వచ్చి ఈరోజు తెలంగాణ భవన్లో సబ్జెక్ట్ లేక తోక ముడిచి వెళ్ళిపోయారని హరీష్ రావు మండిపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports