Harish Rao |అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు-హరీష్ రావు తీవ్ర ఆగ్రహం | ACTPnews

Harish Rao   |అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు-హరీష్ రావు తీవ్ర ఆగ్రహం



తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం (మార్చి 30, 2026) ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అసెంబ్లీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు నడిపిస్తోందని, ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అడ్డుపడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి వస్తున్నారని ఒకరోజు, కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని మరోరోజు.. ఇలా టీ బ్రేక్ పేరుతో గంటల కొద్దీ సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. విద్యుత్ ఉద్యోగులకు చెక్కులు ఇచ్చే కార్యక్రమం కోసం సభను 4 గంటల పాటు ఆపడం ఏంటని ప్రశ్నించారు. “సభకు వచ్చి ప్రిపేర్ అవుతారా, ప్రిపేర్ అయ్యాక సభకు వస్తారా?” అంటూ ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలు చర్చించకుండా సభను నిరవధిక వాయిదా వేయడం పిరికిపంద చర్య అని హరీష్ రావు విమర్శించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *