Harish Rao : ఇదా మీ ఉచిత విద్యుత్ పాలన? | ACTPnews

Harish Rao : ఇదా మీ ఉచిత విద్యుత్ పాలన?



తెలంగాణలో అప్రకటిత విద్యుత్ కోతలు, థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరతపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో కనీసం 8 గంటల కరెంట్ కూడా రాక రైతులు సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో బొగ్గు లేక 1 మరియు 4 యూనిట్లలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని, భద్రాద్రి ప్లాంట్లో నిర్వహణ వైఫల్యంతో 270 మెగావాట్ల ఉత్పత్తి ఆగిపోయిందని గణాంకాలతో సహా వివరించారు. బీఆర్ఎస్ హయాంలో కరెంట్ పోతే వార్తగా ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటేనే వార్తగా మారిందని ఎద్దేవా చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *