రాష్ట్రంలోని ఇతర జిల్లాల ప్రస్తుత పరిస్థితిపై కూడా బాలాజీ స్పష్టమైన అంచనాలు ఇచ్చారు. ప్రధానంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వరుణుడు ముంచెత్తనున్నాడని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ డౌన్పోర్ (కుండపోత వర్షాలు) కురుస్తాయని వివరించారు. ఈ ప్రాంతాల్లోని వ్యవసాయ రైతులు, సాధారణ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు.













