Last Updated:
భారీ ట్రక్కులు, కమర్షియల్ వాహనాలు, JCBలు, నిర్మాణ రంగంలో ఉపయోగించే భారీ యంత్రాలు నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ అవసరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. డ్రైవింగ్ నైపుణ్యాలతో పాటు వాహనాలు, యంత్రాల నిర్వహణ, రోడ్డు భద్రతపై సరైన అవగాహన కల్పిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారీ వాహనాలు, నిర్మాణ రంగంలో ఉపయోగించే భారీ పరికరాలను నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి భారీ వాహనాలు, నిర్మాణ యంత్రాలను నడిపే డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ తప్పనిసరి చేసే సమగ్ర నిబంధనలు లేవని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు డ్రైవింగ్ నైపుణ్యాలతో పాటు వాహనాలు, యంత్రాల నిర్వహణపై డ్రైవర్లకు సరైన అవగాహన కల్పించడం అత్యంత కీలకమని గడ్కరీ అన్నారు.














