తమిళంతో పాటు తెలుగులోనూ అబ్బాస్ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ప్రియా.. ఓ ప్రియా’, ‘రాజా’, ‘కృష్ణబాబు’, ‘అల్లుడుగారు వచ్చారు’, ‘నీ ప్రేమకై’ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. కేవలం సోలో హీరోగానే కాకుండా వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘రాజా’ సినిమాలో అబ్బాస్ నటన సాఫ్ట్ హార్టెడ్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. 2015లో ‘పచ్చక్కల్లం’ అనే మలయాళ చిత్రంతో ఆయన తన సుదీర్ఘ సినీ ప్రయాణానికి ముగింపు పలికారు. సినిమాలకు గుడ్ బై చెప్పాక అబ్బాస్ తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్ వెళ్లిపోయారు. 11 ఏళ్ల తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్‌పైకి రీ ఎంట్రీ ఇచ్చాడు. జీవీ ప్రకాష్ హీరోగా నటించిన హ్యాపీ రాజ్ అనే తమిళ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.














