Last Updated:
Hing Powder Ban: వంటింట్లో నిత్యం ఉపయోగించే ఇంగువ విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కీలక చర్యలు చేపట్టింది. నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని గుర్తించిన రెండు ప్రముఖ బ్రాండ్ల హింగ్ పౌడర్ విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించింది. పరీక్షల్లో ఉత్పత్తుల నాణ్యత, లేబులింగ్కు సంబంధించిన లోపాలు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు FSSAI వెల్లడించింది.
మన వంటగదుల్లో ప్రతిరోజూ వాడే ఆహార పదార్థాల నాణ్యత విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI – ఎఫ్ఎస్ఎస్ఏఐ) మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా, దేశవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన రెండు ప్రముఖ మసాలా బ్రాండ్లకు ఈ సంస్థ భారీ షాక్ ఇచ్చింది. ప్రసిద్ధ కంపెనీలైన ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే లాల్జీ గోధూ అండ్ కంపెనీలకు చెందిన ‘హింగ్ పౌడర్’ (ఇంగువ పొడి) విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని శనివారం నాడు సంచలన ఆదేశాలు జారీ చేసింది.














