Last Updated:
Hockey World Cup 2026: ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచకప్ 2026 టోర్నీలో శుభారంభం చేసిన భారత పురుషుల హాకీ జట్టు, అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది.
వాగెనర్ హాకీ స్టేడియంలో సోమవారం జరిగే పూల్-డి రెండో లీగ్ మ్యాచ్‌లో బలమైన ఇంగ్లండ్ జట్టుతో భారత్ తలపడనుంది. తమ తొలి మ్యాచ్‌లో వేల్స్‌పై 3-1 తేడాతో విజయం సాధించి టీమ్ ఇండియా టోర్నీని ఉత్సాహంగా ఆరంభించగా, ఇంగ్లండ్ సైతం తమ తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 4-1 తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇరు జట్లు వరుసగా రెండో విజయంపై కన్నేయడంతో, పూల్-డి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఖరారు చేసుకోవడంలో ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారనుంది.














