Last Updated:
Hyderabad: నిజాయితీపరులు ఇంకా ఉన్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. కష్టపడి సంపాదించే కంటే ఈజీ మనీ కోసం ఎదురుచూసే ప్రజలు ఉన్న ఈరోజుల్లో మర్చిపోయిన డబ్బును తిరిగి వెనక్కి ఇవ్వడం అనేది అభినందించదగిన విషయం. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TGSRTC)బస్ కండక్టర్ తన నిజాయితీని నిరూపించుకొని బస్సులో ప్రయాణించిన ఓ జంటకు చాలా మేలు చేశాడు.
Hyderabad: నిజాయితీపరులు ఇంకా ఉన్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. కష్టపడి సంపాదించే కంటే ఈజీ మనీ కోసం ఎదురుచూసే ప్రజలు ఉన్న ఈరోజుల్లో మర్చిపోయిన డబ్బును తిరిగి వెనక్కి ఇవ్వడం అనేది అభినందించదగిన విషయం. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TGSRTC)బస్ కండక్టర్ తన నిజాయితీని నిరూపించుకొని బస్సులో ప్రయాణించిన ఓ జంటకు చాలా మేలు చేశాడు. హజ్ యాత్రకు బయల్దేరిన ఓ జంట హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ వద్ద బస్సు దిగేటప్పుడు తమ దగ్గరున్న డబ్బును ఓ బ్యాగులో పెట్టుకున్నారు. బస్సులో దాన్ని మర్చిపోయి దిగివెళ్లిపోయారు. బస్సు కండక్టర్ దానిని గమనించి తిరిగి ఆ దంపతులకు అప్పగించారు. కండక్టర్‌లోని నిజాయితీ గుణం చూసి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.














