Last Updated:
Hyderabad: మానవ శరీరంలోకి ప్రవేశించి మెదడును తీవ్రంగా దెబ్బతీసే ప్రాణాంతక ఫంగస్ పనితీరు వెనుక ఉన్న కీలక రహస్యాన్ని హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ – CCMB) శాస్త్రవేత్తలు విజయవంతంగా ఛేదించారు.
మానవ రోగనిరోధక వ్యవస్థను ఏమార్చి తీవ్ర అనారోగ్యానికి గురిచేసే ‘క్రిప్టోకోకస్ నియోఫార్మాన్స్’ (Cryptococcus neoformans) అనే ఫంగస్ స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో ఇది అత్యంత కీలకమైన పురోగతిగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈ సరికొత్త పరిశోధన ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు సరికొత్త ఔషధాలు, చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి నూతన మార్గం ఏర్పడింది.














