Last Updated:
Hyderabad: నగరంలో వేడివేడిగా, ఘాటు మసాలాలతో ఘుమఘుమలాడే చికెన్, మటన్ బిర్యానీలు లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! రంగు, రుచి వెనుక దాగి ఉన్న అసలు నిజాలు తెలిస్తే భోజనప్రియులు ముద్ద ముట్టడానికే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బయట హోటళ్లలో వడ్డిస్తున్న మాంసం ఎన్ని రోజుల క్రితం ఫ్రిజ్‌లలో పెట్టి కుళ్లిపోయిందో తెలియకుండానే నగరవాసులు లాగించేస్తున్నారు. ఈ తరహా కలుషిత ఆహారం నేరుగా ఆసుపత్రుల పాలు చేయడమే కాక ప్రాణాలకే ముప్పు తెస్తోంది. ఇటీవల నగరంలోని పలు ప్రముఖ ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ (TG-SAFE) ఎన్ఫోర్స్మెంట్ విభాగం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బహిర్గతమయ్యాయి.














