Last Updated:
Hyderabad: హైదరాబాద్‌లో అనుమానాస్పదమృతి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చనిపోతున్న వారి ప్రాణాలకు కుటుంబ కలహాలు, ఆర్ధిక సమస్యలు, భార్యభర్తల మధ్య విభేదాలు, లైంగిక వేధింపులు ఏవో అర్ధం కావడం లేదు. తాజాగా పోచారంలో ఉన్న సంస్కృతి టౌన్‌షిప్‌లో నివాసముంటున్న ఓ వివాహిత ఉద్యోగిని అపార్ట్‌మెంట్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకోవడం సంచలనంగా మారింది.
Hyderabad: హైదరాబాద్‌లో అనుమానాస్పదమృతి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చనిపోతున్న వారి ప్రాణాలకు కుటుంబ కలహాలు, ఆర్ధిక సమస్యలు, భార్యభర్తల మధ్య విభేదాలు, లైంగిక వేధింపులు ఏవో అర్ధం కావడం లేదు. తాజాగా పోచారంలో ఉన్న సంస్కృతి టౌన్‌షిప్‌లో నివాసముంటున్న ఓ వివాహిత ఉద్యోగిని అపార్ట్‌మెంట్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకోవడం సంచలనంగా మారింది. సంతోషి చనిపోయిన సమయంలో భర్త ఇంట్లోనే ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్త వేధింపుల వల్లే సంతోషి చనిపోయిందని ఆరోపిస్తున్నారు. అనుమానాస్పదమృతి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
హైదరాబాద్‌లో వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పోచారంలోని సంస్కృతి టౌన్‌షిప్‌లోని నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంతోషి తన ఫ్లాట్‌లో చున్నీతో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. భర్త పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్తలానికి చేరుకొని విచారిస్తున్నారు. సంతోషి స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంగా పోలీసులు తెలిపారు. అయితే కొన్నేళ్ల క్రితమే విశాఖపట్నంకు చెందిన రమాకాంత్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది సంతోషి. ఈ దంపతులకు రెండున్నరేళ్ల కవల పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.
సంతోషి గెలాక్సీ టవర్స్ యాక్సిస్ బ్యాంక్‌లో పనిచేస్తోంది. చనిపోయిన సమయంలో ఆమె భర్త రమాకాంత్ ఇంట్లోనే ఉన్నాడు. పని మనిషి వచ్చి చూసేసరికి విగతజీవిగా సంతోషి కనిపించడంతో వెంటనే గట్టిగా కేకలు వేసి రమాకాంత్‌తో చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. సంతోషి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె కుటుబం సభ్యులు. భర్త రమాకాంత్ వేధింపుల వల్లే సంతోషి మృతి చెందినట్లుగా ఆరోపించడంతో అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే రమాకాంత్, సంతోషి మధ్య ఏవైనా గొడవలు, మనస్పర్ధలు ఉన్నాయా అనే అనుమానంతో పాటు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
అపార్ట్‌మెంట్ వాసులు, సంతోషి కుటుంబ సభ్యులతో పాటు ఆమెతో పని చేస్తున్న సహ ఉద్యోగులను విచారిస్తామని పూర్తి వివరాలు తెలియగానే మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. వివాహిత సంతోషి మృతి కేసులో భర్త ప్రమేయం ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.














