Hyderabad: సిటీలో ట్రాఫిక్ పోలీసులతో కొత్త ప్రాబ్లమ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్, వాహనదారుడి ఆవేదన ఇది | ట్రెండింగ్ | ACTPnews

Hyderabad Traffic Police


Last Updated:

Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు నడిరోడ్డుపై వెహికల్స్ ఆపుతూ వాహనదారులు ప్రమాదాలకు గురవడానికి కారణమవుతున్నారంటూ ఓ వ్యక్తి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో సదరు పౌరుడు ట్రాఫిక్ పోలీసులకు అడిగిన ప్రశ్నలు అన్నీ కరెక్ట్‌గా ఉండటంతో నెటిజన్లు అతనికి సపోర్ట్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులపై మండిపడుతున్నారు.

Hyderabad Traffic Police
Hyderabad Traffic Police

HYDERABAD: తీసుకుంటున్న జీతానికి తగినట్లుగా ఎవరి డ్యూటీ వాళ్లు చేయాలి. అయితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది అవినీతి సొమ్ముకి అలవాటు పడి ఏసీబీకి చిక్కుతున్నారు. ఇంకొందరు అడ్డగోలుగా అక్రమాస్తులు కూడబెట్టి ఐటీ అధికారులకు దాడుల్లో బుక్కైపోతున్నారు. అయితే ప్రజలు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే ఈవిధంగా రూల్స్ బ్రేక్ చేస్తుంటే.. కనీసం ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ట్రాఫిక్ పోలీసులపై కూడా డ్యూటీ సరిగా చేయడం లేదని.. ప్రజలకు ట్రాఫిక్ సిబ్బంది తనిఖీలు ఇబ్బందికరంగా మారుతున్నాయని సోషల్ మీడియాలో విస్తృతంగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ వనస్థలిపురం దగ్గర పనామా గోడౌన్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు నడిరోడ్డుపై వెహికల్స్ ఆపుతూ వాహనదారులు ప్రమాదాలకు గురవడానికి కారణమవుతున్నారంటూ ఓ వ్యక్తి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో సదరు పౌరుడు ట్రాఫిక్ పోలీసులకు అడిగిన ప్రశ్నలు అన్నీ కరెక్ట్‌గా ఉండటంతో నెటిజన్లు అతనికి సపోర్ట్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులపై మండిపడుతున్నారు.

కొత్త ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది..

తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలను పరిశీలించడం, పర్యవేక్షించడంలో ట్రాఫిక్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూల్స్ పాటించని వాహనదారులపై చలాన్ల రూపంలో ఫైన్ విధిస్తున్న ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం వాటిని వసూలు చేయడానికి కూడా సరైన విధానం, పద్దతిని పాటించడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. తాజాగా వనస్థలిపురం దగ్గర పనామా గోడౌన్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు తెల్లవారుజామునే రోడ్లపైకి వచ్చి డ్యూటీ చేస్తున్నట్లుగా ఓ సెల్ఫీ దిగి ఫోటోని పైఅధికారులకు సెండ్ చేసి తర్వాత రోడ్లపై వెళ్ల వాహనదారులను అడ్డుకొని చలాన్లు వసూలు చేస్తున్నారు. దీనిపై ఓ యువకుడు పోలీసుల్ని ప్రశ్నించాడు. పెద్ద పెద్ద రోడ్ల మధ్యలోకి వచ్చి చలాన్లు వసూలు చేస్తుంటే వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. ఇలా ఎందుకు చేస్తున్నారని నిలదీశాడు.

నిర్లక్ష్యంగా విధుల నిర్వాహణ..

దానికి పోలీసులు అతని ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా.. నీకు ఏమైనా దెబ్బలు తగిలాయా, నీ వాహనాన్ని వేరే వాహనం ఢీకొట్టిందా ఎందుకు అడుగుతున్నావని వితండవాదానికి దిగారు. ఇంకా చెప్పాలంటే సదరు వాహనదారుడు సెల్‌ఫోన్‌లో వాళ్లు డ్యూటీ చేస్తున్న తీరు.. నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న విధానాన్ని రికార్డ్ చేస్తుంటే కూడా ఏమాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా నిలుచొని అతనితో వాగ్వాదానికి దిగారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల తీరు..

ట్రాఫిక్ పోలీసులు ఎక్కడపడితే అక్కడ.. ఏ సమయంలో పడితే ఆ టైమ్‌లో రద్దీగా ఉండే రోడ్లపై షడన్‌గా వచ్చి వాహనాలు చెక్ చేయడం, చలాన్లు కట్టమని నిలబెట్టడం చాలా అభ్యంతరకరంగానే కాకుండా ఇబ్బందికరంగా ఉందంటున్నాడు. ఈ వీడియోతో పాటుగా చిన్న కామెంట్ కూడా షేర్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ని నియంత్రించకుండా తెల్లవారుజామునే అడ్డా పైనా కూలీలు వొచ్చినట్లు వొస్తారు ..లొకేషన్ లో ఒక సెల్ఫీ దిగి ఆఫీసర్స్ కి పంపించి కలెక్షన్స్ స్టార్ట్ చేస్తారని కామెంట్ పెట్టాడు. వీళ్లు మార్నింగ్ వొచ్చేదీ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికీ కాదని రోడ్డు మధ్యలోకి వొచ్చి పెద్ద వాహనాలు రోడ్ పైనా ఆపి చలానాలు వేస్తారు. ట్రాఫిక్ జామ్ అవడానికి కారణం వీళ్లేనంటూ విమర్శలు చేశాడు.

ట్రాఫిక్‌ని గాలికి వదిలేసి..

విచిత్రం ఏమిటంటే ట్రాఫిక్ పోలీసులకు రోజుకి ఇన్ని కేసులు నమోదు చేయాలనే టార్గెట్ ఉందని.. పైఅధికారులు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయడం కోసం ఒకటి రెండు గంటలు రద్దీ ప్రదేశాల్లో వాహనాలు చెక్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని టార్గెట్ రీచ్ అవ్వగానే అక్కడ నుండి జంప్ అవడమే కాకుండా అడ్రస్ ఉండరని కామెంట్ చేశాడు. ట్రాఫిక్ సిబ్బంది ప్రైమరీ డ్యూటీ ట్రాఫిక్ ని కంట్రోల్ చెయ్యాలనే విషయాన్ని మర్చిపోయి.. ఫోటోగ్రఫీ చేస్తారు అంటూ వీడియో రికార్డ్ చేసి ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్య తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాడు.

డ్యూటీ టైమ్‌లో వసూళ్లు..

హైదరాబాద్‌లో వాహనదారుడికి ట్రాఫిక్ పోలీసుల వల్ల కలిగిన అసౌకర్యానికి సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. అతని వాదనకు సపోర్ట్ చేస్తూ నెటిజన్లు, నగరవాసులు కామెంట్స్ షేర్ చేస్తున్నారు. తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా ఇదే తంతు నడుస్తోందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇంకో నెటిజన్ ఇప్పటికి కూడా వాళ్లు అక్కడే కలెక్షన్స్ రాబడుతున్నారని పోస్ట్ పెట్టాడు. ఏది ఏమైనా ట్రాఫిక్ సిబ్బంది ప్రజా రవాణాకు అసౌకర్యం కలగకుండా రోడ్లపై రద్దీని కంట్రోల్ చేయాలని గుర్తు చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనాలపై చలాన్లు వేస్తే తప్పులేదని.. కాని వాటిని వసూలు చేయడానికి ఇంకో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed