Hyderabad: సిటీలో విచ్చలవిడిగా ఏనుగు దంతాలు సప్లై.. పక్కా సమాచారంతో పట్టుకున్న అధికారులు | తెలంగాణ వార్తలు | ACTPnews

Hyderabad Elephant Ivory Smuggling

Last Updated:

Hyderabad: హైదరాబాద్‌లో అసాంఘీక శక్తులు, కొత్త నేరస్తులు పుట్టుకొస్తున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు వెదుకుతున్నారు. ఇప్పటి వరకు గంజాయి, డ్రగ్స్, గోల్డ్, వెపన్స్, రెడ్ శాండల్, వ్యభిచారం వంటి వాటిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించే ముఠాతో పాటు కొత్తగా మరో గ్యాంగ్‌ని పోలీసులు పట్టుకున్నారు. వీళ్లంతా ఏనుగు దంతాలను అక్రమంగా తరలిస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. నాలుగు ఏనుగు దంతాలు సుమారు 17 కేజీల బరువైన వాటిని సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు.

ఏనుగు దంతాల స్మగ్లింగ్..

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నేరాలకు అడ్డాగా మారిపోయింది. కోట్లాది మంది నివసిస్తున్న ఈ మహానగరంలో స్మగ్లింగ్ బ్యాచ్‌లు పెరిగిపోయాయి. డబ్బులు సంపాదించడం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు నేరస్తులు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో 17 కిలోల ఏనుగు దంతాలను సీజ్ చేశారు డీఆర్ఐ అధికారులు. పక్కా సమాచారంతో హైదరాబాద్‌లో DRI అధికారుల ఆపరేషన్ చేపట్టారు. ఏనుగు దంతాలను విక్రయానికి ప్రయత్నిస్తున్న సమయంలో ముగ్గురిని పట్టుకున్నారు.నిందితుల నుంచి సుమారు 17 కిలోల బరువున్న నాలుగు ఏనుగు దంతాలతో పాటు చెక్కిన ఐవరీ వస్తువులు, ట్రోఫీలను స్వాధీనం చేసుకున్నారు. ఏనుగు దంతాలు, వాటితో తయారైన ఉత్పత్తుల వ్యాపారంపై నిషేధం ఉండటంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం -1972 కింద వాటిని సీజ్ చేశారు. ఏనుగు దంతాలు, వాటితో తయారైన వస్తువులను విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో రైడ్ చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)అధికారులు విక్రయించే ముఠా కదలికలపై నిఘా పెట్టింది.

వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం..

1972 నాటి వన్యప్రాణుల (సంరక్షణ) చట్టంలోని సంబంధిత నిబంధనల కింద స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేశారు. ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ చట్టం ప్రకారం ఏనుగు దంతాలు, వాటితో చేసిన వస్తువుల వ్యాపారం లేదా లావాదేవీలు నిషేధించబడ్డాయి. వన్యప్రాణుల నేరాలపై ఉక్కుపాదం మోపుతామని.. అలాంటి స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్ఐ అధికారులు తెలిపారు.

ఇకపై నిఘా పెంచుతాం..

వన్యప్రాణులు, వాటి ట్రోఫీలు, సంరక్షిత జాతులకు చెందిన వస్తువుల అక్రమ రవాణా, వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుని డీఆర్ఐ దేశవ్యాప్తంగా నిఘా ఆధారిత ఆపరేషన్లు నిర్వహిస్తోంది. వన్యప్రాణుల సంరక్షణకు మద్దతు ఇవ్వడానికి, వ్యవస్థీకృత వన్యప్రాణుల అక్రమ రవాణాను అరికట్టడానికి ఏజెన్సీ చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ఈ తాజా ఆపరేషన్ నిదర్శనమని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఏనుగు దంతాలు, ఆరోపిత లావాదేవీపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports